పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ての3とイ స్వీయ చ రి త్ర ము ఈ కోరంగిలోనున్న -కాలములో "నేను సంగ్ర హవ్యాకరణమును, పద్య రూపమున నీతిదీపికను, చేసి ముద్రింపించితిని. ఆవఱకు పాఠశాలలో బాలు రకు సులభముగాఁ దెలిపెడు తెలుఁగు వ్యాకరణమేదియలేదు, ఉన్నవి సంజ్ఞా పరిచ్ఛేదము, సంధిపరిచ్ఛేదము, ఆజంతపరిచ్ఛేదము, హలంతపరిచ్ఛేదము: క్రియాపరిచ్ఛేదము, అని యైదుభాగ ములనుగల యీ కాలమునకుఁ దగని పురాతన పద్ధతిని వ్రాయబడినవయి యున్నవి. సంజ్ఞాపరిచ్ఛేదములో ప్రథమేతర విభక్తులు శత్రర్ధక చువర్ణ కము మొదలైనవి ద్రుత ప్రకృతికములని చెప్పబడినప్పడు ఆజంతపరిచ్ఛేదము చదివినగాని విభక్తులేవో క్రియాపరి చ్ఛేదమును జదివినఁగాని శత్రర్థకమేదో బాలురకు బోధపడదు. కాని ముందుగానే యజంతపరిచ్ఛేదమునో క్రియాపరిచ్ఛేదమునో చెప్పరాదాయన్న, కువర్ణ కము పరమగునప్ప డుకారబుకారాంతములకు నగాగమాంబగునని యజంత పరిచ్ఛేద మారంభించినచో సంధి పరిచ్ఛేదము ముందుగా చదివినఁగాని యాగము వునఁగా నేమో తెలియదు. సంధిపరిచ్ఛేదమే ముందారంభింతమన్నను, క్ష్వార్ధక ఇకారమునకు సంధి లేదను చొ* క్రియాపరిచ్ఛేదము చదివినఁగాని క్ష్వార్ధకమన నేదో తెలియదు. ఇటువంటిచిక్కులను వదలించి బాలురకు సుబోధమగునట్లు గా వర్ణ పరిచ్ఛేదము, పదపరిచ్ఛేదము, వాక్యపరిచ్ఛేదము, కావ్యపరిచ్ఛేదము: ఆని యింగ్లీ షపద్ధతి ననుసరించి నేను సంగ్రహ వ్యాకరణముచేసితిని. క్రొత్త పద్ధతి పూర్వాచారముననుసరింప నలవాటుపడిన వారికిని పండితులకును సరి పడదు. ఆప్పడు పాఠశాలలోఁ బెట్టుటకయి విద్యావిచారణాధికారి పు_స్తక ముల నంగీకరింపవలసిన పనిలేదు. పాఠశాలానిర్వాహకులు స్వతంత్రించి తమ మనసువచ్చిన పుస్తకములను తమపాఠశాలలో పెట్టుకోవచ్చునుగాని పెట్టుకొను టకు పుస్తకములు లేవు. పాఠశాలా పరీక్షకులు పెట్టుమని చెప్పిన పుస్తకము లనే పాఠశాలా నిర్వాహకులు సాధారణముగా పెట్టుచుందురు. ఆప్పడు బ్రాడ్డాదొరగా రుత్తోరమండలముల పాఠశాలా పరీక్సకులు. ఆయనsrశీప స్వభౌ వలయి తనక్రింది యుద్యోగస్థల మిరాఁదను పాఠశాలల యుపాధ్యాయుల విూఁదను కేకలు వేయుచుండెడివారు, ఆయన నేను (పధానోపాధ్యాయుఁడ