17
యుద్ధ కాండము
నిది పయోనిధి నభం - బిదియని యొరుల
యెదలకుఁ దోఁచక - యేకీభవించి
యొప్పు నంబుధికి పె - న్నుద్దియై మొరసె
నప్పుడు వీరమ - హాకపి జలధి
వేలంబు మైందద్వి - విదులు రేయెల్ల
నాలుగు జాములు - నాల్గుదిక్కులును
నెచ్చరికలఁగాచు - నిడ రఘువరుఁడు
ముచ్చటఁదీఱఁ ద - మ్మునిఁజూచి పలికె.
-: శ్రీరాముఁడు సీతనుగూర్చి విరహమునొందుట :-
"సీతను జోడువా - సిన తనకింక
నేతీరున భరింప - నెన్నిక గలదు? 370
సౌమిత్రి ! యేనొక్క - క్షణమైన నోర్వ
నేమి సేయుదు ? ఱెక్క - లేటికి రావు
జానకి నెడఁబాయ - సం తాపభరము
పై నతిశయమయ్యె - భావంబులోన !
ఎటులున్నదియొ సీత - యెల జవ్వనంబు ?
కటకటా ! వీఱిఁడి - గడతేఱునేమొ ?
నను నేడఁ బాసి మి - న్నక పది నెలలు
చనియెఁగాలంబు మో - సము చేసెఁ దన్ను
యేమి సేయుదు ? ”నని - యెడనంత విసరు
సోమరి వలిగాలిఁ - జూచి రాఘవుఁడు 380
" ఓయి ! సమీర ! మా - యుర్విజమీఁద
హా ! యన మలసి య - య్యతి నెమ్మేని
సంపంగితావి వీ - సరవోవనీక