18
శ్రీ రా మా య ణ ము
ముంపుము నా మేన - ముంచితి వేని
యందుచేఁ గలుగు నం - గాంగసంస్పర్శ
నందిత నిరుపమా - నందమందెదను !
శీతాంశుఁడా ! నీవు - చేర రావయ్య !
సీత నెమ్మోముఁ జూ - చిన నిన్నుఁ జూచి
కన్నులు చల్లనై - కల్యాణి మోముఁ
గన్నకైవడి మేని - కాఁక మానుదును ! 390
విషపాన మొనరించు - విధమునఁ జాల
విషమసాయకుని క్రొ - వ్విరులకు లొంగి
'హా రామ ! హారామ ! ? - యనిపలవించు
నారామ వెతలెన్నఁ - డారునో యింక
ఈ వియోగముపేరి - యింధనావళుల
నావిచారంబను - నాల్కలేఁజాఁచు
మదనానలంబు నా - మదిఁబాదుకొనియె
నది యార్పనొక యుపా - యముఁ గానమిపుడు
జలధిఁ జొచ్చినఁ గొంత - చల్లారునేమొ !
తొలఁగ దన్యమునఁ జే - తోజాతవహ్ని ! 400
నీ సేమ మీయాంజ - నేయుని చేత
నోసీత ! విని కొంత - యూరడిల్లితిని.
సజల కేదారంబు - సంగడిఁ దనదు
రజముఁ గోల్వోకఁ బై - రు చెలంగుకరణి
యిరువురము శయించు - నీవసుంధరయె
పరిణామ మిచ్చు నే - పట్టున మనకు.
ఏ వేళ జానకి - యెలనవ్వు మొగము
తావి యానుదుఁ దేఁటి - తామరఁబోలి ?