పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

71

ధరా ! కోదండదీక్షాదిగురూ ! దశరథరాజతనయా ! కౌసల్యాగర్భ రత్నాకరసుధాకరా ! భరతాగ్రజా ! సౌమిత్రిభ క్తిప్రియా! శత్రుఘ్న నిరంతర సేవితా ! భక్తపరాధీనా ! ఇక్ష్వాకుకులతిలకా ! పక్షీంద్రవాహనా ! దేవాది దేవా ! 'తాటకాప్రాణాపహరణా ! విశ్వామిత్రయజ్ఞ ప్రతిపాలకా ! యజ్ఞకర్తా ! యజ్ఞభోక్తా ! 'సర్వం విష్ణుమయం జగట్' శ్రుతినికర ప్రవే శీతా ! అహల్యాశాపవిమోచనా ! పురహర కార్ముక ఖండనా ! సీతా వివాహా ! పరశురామ పరాక్రమహరణా ! చిత్రకూటాచల నివాసా ! విరాధ దైత్య సంహారకా! శరభంగదర్శనా! దండకారణ్య నిలయా! శూర్ప ణఖా నాసికాచ్చేదనా ! ఖరదూషణత్రిశిరాది చతుర్దశ సహస్ర దానవ శిరశ్చేదనా ! మారీచ మాయామృగ వేటకాఱా! యోజన బాహు ఖండనా ! జటాయు ముక్తిదాయకా ! శబరీ ప్రసన్నా ! పంచవటితీర నివాసా ! ఆంజనేయ ప్రియాలంకారా ! మాల్యవత్ ప్రవేశా ! వాలీ నిగ్రహణా ! లవణాంబుధి హల్లకల్లోలా ! దక్షిణసింధు రాజబంధనా !. విభీషణ రాజ్య స్థాపనాచార్యా ! సువేలాద్రి ప్రవేశా ! కుంభ నికుంభ మక రాక్ష ధూమ్రాక్ష 'విరూపా క్షాతికాయ మహాకాయ కంపనాకంపన ప్రహస్తరక్తవర్ణా గ్నివర్ణ సర్పరోమ వృశ్చికరోమాది రాక్షస శిర.శ్చే దనా ! ఇంద్రజిత్తుతలగొండుగండా ! రావణగిరి వజ్రాయుధా ! పం క్తికంఠ శిరశ్చేదనా ! కుంభకర్ణాపహారా ! ఛప్పన్న దేశ నిశ్చలపాలకా ! శ్రీ రాఘవేశ్వరా !.అవధారు ! శ్రీ వేంకటేశ్వరా !

152

అర్జునసఖా ! నీవు నిర్వచించిన పుణ్యంబు చేసిన దేవతల కూర్ద్వలో కంబును, పాపంబు చేసిన రాక్షసులకు నధోలోకంబును, పుణ్య పాప మిశ్రితు లయిన మనుష్యులకు మర్త్యలోకంబై న భూలోకంబును, సుజ్ఞాను లయినవారికిఁ బరమపదంబును గట్టడచేసి యొసంగి త్రిలోక బంధుండనై యున్నాఁడవు. ఎవ్వరికి నపకారము చేయువాఁడవు గావు. వారు వారు తమ తమ నేర్పు నేరముల మిమ్ముఁ గొందఱు మెప్పించి బ్రతి కెడివారును, " గొందఱు మీతో నిరోధించి పొలయువారును, ఇంతే కాని మీరు లో