పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

{{rh|72|శ్రీ వేంకటేశ్వర వచనములు| }

కోపకారులు. మీ ప్రభావంబు తెలియనివారు మిమ్ము దూరుదురు. ఎఱీఁగిన మహాత్ములు మిమ్ముఁ బొగడుదురు. ఫక్షా పరపక్షంబులు మీకు లేవు. ఇందులకు వేదశాస్త్ర పురాణేతిహాసంబులు సాక్షులు. మీదాసు లయినవారు మీకుఁగా నేప్రమాణంబయినం జేసెదరు. పంపు వెట్టు కొనుము. శ్రీ వేంకటేశ్వరా !

153

అనంతకల్యాణ గుణనిధీ ! నీవు భక్తవత్సలుఁడ వనుటకు సందేహమేలా ? అందులకుఁ బ్రహ్లాదుండే సాక్షి. శరణాగత వజ్రపంజర బిరు దుకు సందేహంబేలా ? అందుకు విభీషణుండే సాక్షి. దురితదూరుండ వను టకుఁ దర్క వాదంబు లేలా? అందు కహల్యయే సాక్షి. నీ యుదారగుణం బున కనుమానం బేల ? ఇందుకుఁ బాంచాలియే సాక్షి. ఆ ర్తజనపరాయ ణుండ వగుటకు శంక యేలా? ఇందులకుఁ గరిరాజే సాక్షి. అగణితము లయిన వేదనల నవసాదించుటకు సత్యంబు లేలా ? అందుకు ధ్రువుండే సాక్షి. ఇవన్నియు నీ మహిత ప్రభావం బగుట 'యెఱింగి నీ నామో' చ్చారణ కే శరణు సొచ్చితిని. శ్రీ వేంక టేశ్వరా !

154

ఇంద్రాదివినుతా ! నీ శరణాగతి ప్రభావంబు నెఱంగునట గౌతమ మహాముని. నీ నామకీర్తన యెఱుంగునట పార్వతి. నీ జిహ్వరుచి యెఱుంగునట విదురుండు, నీ మనోభావం బెఱుంగునట శ్రీకాంతామణి. నీ మహ త్వం బెఱుంగునట ధనంజయుండు. నీ యఖిలవిద్యా విశేషంబు నెఱుంగునట వేణునాదంబు, నీ యలంకారం బెఱుంగునట కౌస్తుభ శ్రీ తులశీవనమాలికలు. నీ జవం బెఱుంగునట వైనతేయుండు. నీ భుజ బలపరాక్రమం బెఱుంగునట శార్ జ్గ గదా ప్రముఖ దివ్యాయుధంబులు. నీ రూపవిభ్రమం బెఱుంగుదురట గోపాంగనలు. నీ భుజావి శేషంబు నెఱుంగునట వామ దేవుండు. నీ భక్తవాత్సల్యంబు వైష్ణవ భాగవ తోత్తము లెఱుంగుదురట ! నీ శౌర్యశాంత మహిమలు వైకుంఠసన్ని ధాను లెఱుంగుదురట! పూతనా హిరణ్యాక్ష రావణ కుంభకర్ణ జయ