పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

శ్రీ వేంకటేశ్వర వచనములు

జీవుండు గృతమిట్టి కర్మంబులుం జేసితినని తన పాపంబులు గుర్తించుచు నవమమాసంబున నారాయణ ధ్యాన పరుండగుచుఁ గరములఁ గర్ణ ంబులు మూసి, దశమమాసంబున ధరణిపై నుదయించి యజ్ఞానాంధకారం బనియెడి తిమిరంబుచేతఁ గప్పంబడి, కొన్ని వర్షంబులు స్తన్యపానంబునఁ గోన్ని వర్షంబు లన్నప్రాశనంబున, భక్ష్యభోజ్య లేహ్య చోష్యపానీయం బులచేతఁ బరితృప్తుండై యీవిధంబున ద్వాదశవర్షంబులు నజ్ఞాన కృత్యం బులఁ జేయుచు పోడశవర్షంబునఁ బంచేంద్రియంబులఁ బ్రబలుచు రాగమద మాత్సర్యంబున మత్తగజ గమనుం డగుచు జాతి వర్ణంబులు చింతింపక వర్ణాశ్రమ ధర్మంబుల వరుసలుదప్పి జీవుండు హింసా పరం దగుచు నేక వింశతివర్షంబుననుండి సంసారాంధకారంబునం దగిలి పుత్రేషణ దారేషణ ధనేషణంబు లనియెడి యీషణత్రయంబునం జిక్కు పడి నిన్నుఁ గానక యుండు. పంచాశద్వర్షంబున నుండి జవస త్త్వము లుడిగి జరాభారసంస్థలి తుండై యుండు. పంచస ప్తతి వర్షంబున నుండి శ్లేష్మ సంకలితుండై యంధకత్వంబును బధిరత్వంబునును దాసీనత్వంబును నుచ్చిష్టత్వంబును,గను. వాత పైత్య శ్లేష్మ సంకలితంబైన 'ద్వంద్వరోగంబులచేత మగ్నతఁబొంది శతవర్షంబులలో హతుండై యిహలోకంబునఁ గళేబరంబు విడిచి యాతనా శరీరధారుండగుచు యమలోకంబున కేఁగి యతి ఘోర మహా ఘోర బాధ లనియెడి నరక బాధలఁ గుందుచు ననసిప త్రవనంబులనియెడు వన భూములం గడుదుఃఖాత్ముండై తిరుగుడు వడుచుండునట. ఇవ్విధంబంతయు నే విని భయపడి, మీ యమిత కళ్యాణ గుణంబులు కొనియాడఁ దొడంగితి, నన్ను గృపఁజూచి రక్షింపవే శ్రీ వేంకటేశ్వరా ! -

151

దేవనారాయణా ! పరబ్రహ్మస్వరూపా!, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా ! పురాణపురుషోత్తమా! పుండరీకవంద్యా ! కపటనాటక నూత్రధారీ ! అగణితమహిమావతారా ! సకలకల్యాణగుణవర్ణితా | సకలజగదాధారా ! ఆశ్రితకల్పభూజా ! శరణాగతవజ్రపంజరా ! " కారు ణ్యావతారనిధీ! భుక్తిముక్తి ఫలదాయకా! శంఖచక్రగదా శార్ జ్ఞాయుధ