పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

శ్రీ వేంకటేశ్వర వచనములు


నంబు చేసితిరి. మీరు నిర్హేతుక దయానిధు లౌట యిందులోనే విశదం బాయె ; శ్రీ వేంకటేశ్వరా !

74

సోమకాసురభంజనా ! భూమిమీఁద సస్యంబులు పండి నానాధాన్యంబులుఁ గొండలు కోట్లునై, కుప్పలుపడుచున్నవి. సస్యంబులకు బీజంబు లొక్కటియును ఫలంబు లధికంబులునై యున్నవి. ఇంత సామర్థ్యం బాబీజముల కెక్కడిది? మీమహిమకెకాక. మీరు గలుగుట కిది లోక దృష్టాంతంబు. మిమ్ము నితరు లెఱుంగరానియట్లు వీపు గానరా దాఁగెదరు. మీ రెటువలె నుండినను, వేదశాస్త్రంబులు మిమ్ముఁ జాటి చెప్ప కేల మానెడిని ? మహాత్ములై నవారు మిమ్ము నెఱింగి కొలువ కేల మానెదరు? మీకరుణ యిందఱమీఁదఁ బాఱ కెట్లుండెడిని ? మీదివ్య తేజః ప్రకాశంబు లెటువలె మూసి పెట్టవచ్చు? చాలుం జాలు నింక మీ వినోదంబులు బయలుపడెను. విభాండకునికిఁ బ్రత్యక్షంబైనయట్లు, ముచికుందునికిఁ బ్రత్యక్షంబై నయట్లు, ఉదంకునకుఁ బ్రత్యక్షంబై నట్లు నాకు మీరు ప్రత్యక్షంబుగండు శ్రీ వేంకటేశ్వరా !

75

అయోధ్యాపురాధీశ్వరా ! యేరీతి మసస్సు పట్టుదునో యే చందంబున మెప్పింతునో యేరీతిఁ గృప నామీఁదం బాఱునో యెటువలె నా కభిముఖము చేసికొందునో యేక్రమంబున మీకుఁ జనవరినై బ్రదుకు దునో యని మానసంబునం గోరుచుందును. నీవు నాయంతరంగంబులో జేరువనే యున్నాఁడవు. బ్రహ్మాది దేవతలకు దుర్లభుండవై న నీవు నా కెట్లు సులభుండ వయ్యేవంచుఁ జాతక పక్షులు మేఘంబులలోని జలంబుల కాసపడినయట్లు, ఆకాశంబున నున్న సూర్యునితో గమలంబులు చుట్టఱి కంబులు చేసినట్లు, చంద్రోదయంబునకు సముద్రంబు పొంగినట్లు, వెన్నె