పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

35

లకుఁ జంద్రకాంతంబులు గరఁగినట్లు నేను మీదర్శనంబునకు వీక్షింపుచున్నాఁడ. అయితే నేమి కొఱంత ? ఊరకున్న కీటంబుఁ దెచ్చి తుమ్మెద తనుఁ జేయుచున్నది. ఈ భ్రమరకీటన్యాయంబు దక్కింపనింక దేవరచి త్తము, నాభాగ్యము; శ్రీ వేంకటేశ్వరా !

76

వాసుదేవా ! దేవకీనందనా ! గోపాలమూర్తీ! లక్ష్మి మనోహరా ! భూకాంతాప్రియా ! గోపికావల్లభా! రుక్మిణీ ప్రాణనాయకా ! సత్యభామామనోహరా ! జాంబవతీసుముఖా ! కాళిందీసరససల్లాపా ! మిత్రవిందాభోగాలోకైకరతా ! భద్రాకుచకుంభవిహారా ! నీ రాసగ్రహాది సరససత్కథా ప్రసంగంబులు భాగవత పురాణంబులు. ఈ కథలు విన్న వారికిఁ బుణ్యంబు లనంతంబులై పరలోక సాధనంబు లగునటే ! యివి యెటువంటి విచిత్రంబులు ! నీ కౌతుక క్రీడలు మోక్ష సాధనంబులట ! శ్రీ వేంకటేశ్వరా !

77

ధ్రువవరదా ! నాకు నెటువలెఁ బ్రత్యక్షం బయ్యెదవో? విభుని, రాకకుం గాచుకొన్న విరహిణిచందంబున మీ రాకకు నెదురు చూచుచున్న వాఁడ. చన్నుఁబాలకు దేవుఱు స్తనంధయుని బోలి మీ భుక్త శేషంబు వెదకుచున్నవాఁడ. పొలముననుండి మేసివచ్చు ధేనువు రాకకుఁ గ్రేపుచందంబున మీ దేవుల కటాక్షంబునకు నేఁకారుచున్న వాఁడ, హంసతూలికా తల్పంబుమీఁద శయనించు రాజురీతి మీ పాదంబులకు సాష్టాంగము సేయం గాచుకొన్న వాఁడ; నివి నాగుణంబులు. అపేక్షించిన వారి నుపేక్షింపరాదని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. అది యట్లుండనిమ్ము. ఏలిక మన్నించుకొలఁదినే కానీ బంటునకుం గొనరఁగా నడుగరాదు, నీవు నా హృదయంబున నెప్పుడును నేమఱకుమా! అన్నియు సమకూఱెడు ; శ్రీ వేంకటేశ్వరా ! |