పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

శ్రీ వేంకటేశ్వర వచనములు

ఆ కోరికలను నొడిఁగట్టుకొని యనుభవించనే వేడుకయగుచున్నది. నిన్ను ధ్యానంబు నేయంజనదు నామనస్సు క్రొత్త కోడెవంటిది. జ్ఞానంబని యెడు కంబంబునఁగట్టి వైరాగ్యంబనియెడు సాదుపసరముతో లంకె వైచి నీ కృషికి దిద్దుకొనవే ; శ్రీ వేంకటేశ్వరా !

60

హిరణ్యగర్బా : నీకుఁ బాన్పైన శేషుండు బ్రహ్మాండం బెత్తుకొనియె; నీకు వాహనం బయిన గరుత్మంతుం డమృతంబుఁ గొని చనియె; నీకూతురైన గంగాభవాని హరుశిరస్సు నెక్కె; ధ్రువుండు బ్రహ్మలో కంబతిక్రమించె; నారదుండు సురలకుఁ బోరువెట్టుచున్నాఁడు; రుక్మాం గదుండు యమలోకంబుంబాడుచేసె; శకుండు వైరాగ్యంబు చూఱఁగొనియె; ఇందుచేతను నీదాసులు నీకంటె నధికులౌట తేటపడియె; శ్రీ వేంకటేశ్వరా !

61

రామరామ : లోకంబెల్ల నొకపాదంబునఁ గొల్చితివట; నీరూపం ' బేమని చెప్పుదును? అనంత వేదంబులు నిన్నుం బొగడునట ! నీ గుణంబు లెన్ని యని యెన్నుదును ? నీ రోమకూపంబుల నజాండకోట్లు నిండుకొన్నవట ! నిన్ను నేమని వర్ణింతును ? నీవు సర్వదేశ సర్వకాల పరిపూర్ణుండవై యుండఁగాను నీప్రభావం బేమని పొగడుదును? పురాణ పురుషుండవట; నీతుద మొద ళ్లెఱుంగువా రెవ్వరు? నిన్నుఁ దెలియ నుద్యోగంబుఁ జేసెద. నాయాస లేమని చెప్పుదు ? నంతయు నీ వెఱుంగుదువు: శ్రీ వేంకటేశ్వరా !

62

శరణాగతవజ్రపంజరా ! నీవు లోకసంరక్షణార్థంబై నీ స్వతంత్రంబున నెత్తిన రామావతారంబున నీ శక్తిని నీవె యెఱుంగ వని యందురు