పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

29

గొందఱు. హరువిల్లు నెక్కు పెట్టి విఱిచినదియును, పరశురాముఁడు గడియించిన స్వర్గ సోపానంబులం దెగవ్రేసినదియును, సుగ్రీవునికి వాలిం జంపెదనని ప్రతిజ్ఞ చేసినదియును, శరణుసొచ్చిన విభీషణునకు మున్నుగా లంకారాజ్యంబునకుఁ బట్టంబు గట్టినదియును, సీతను వెదకంబోయిన వానరులలోన హనుమంతుచేతికి నుంగరం బొసంగినదియును, జలధిపై విల్లు దొడిగినదియును నీ భుజబలిమియకాదె ! నీ ప్రతాపంబు నీ వెఱుంగని దేమి ? నీవు సర్వజ్ఞుండవు. నిన్ను నెఱుంగనివారలె యజ్ఞులు గాక ! శ్రీ వేంకటేశ్వరా!

63

కౌసల్యానందనా ! ఈ మనుష్య జన్మంబు నీవె నా కొసంగి పుట్టించితివి.ఇది నాకిచ్చిన వారకపు శరీరము. ఇందుల యాభరణంబులు, నన్నపానాది భోగంబులు, నీ కరచరణాద్యవయవంబులు చేసిన పుణ్య పాపంబులు నీకె సెలవు. నేనేమిటివాడను? అణుమాత్రపు జీవుండను. ఈ తనువు నామీఁద నదనంబు వెట్టితివి. రాచముద్రకుం బెట్టిన లంచంబు రాజునకు సమర్పణంబె కాదా ! అది యెట్లంటివా? ఆత్మ నీవుండెడి నెలవు. నీ వున్నచోటను నూటయెనిమిది "తిరుపతు లును సకల పుణ్య క్షేత్రంబును నుండును. న న్నజ్ఞానంబు లంటనీయకు ; శ్రీ వేంకటేశ్వరా!

64

సుగ్రీవరాజ్యస్థాపనా ! నే నొకవేళ నీ దాస్య మనియెడి గజస్కంధమందారూఢుండనై చరియింతు. మఱియొకపరి నీవు నాకుం గల వనియెడి విశ్వాసం బను తురంగంబు నెక్కి యాడెదను. ఇంకొకప్పుడు మీ కథలు విని యానందరథంబు పై విహరింతును. ఆ తర్వాతను వినయవిధేయవర్తనంబు లనియెడి చరణ త్రాణంబులతోడఁ బదాతినై మీ యవసరంబు గాచుకొని ముందఱఁ గొలువు చేయుదును. ఈరీతి