పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

27

దిగనైతి; మీ సన్నిథిని "దాంబూలచర్వణంబులు చేసితి; బాల్య యౌవన కౌమార గతులచేత మీకు మ్రొ క్కనైతి; మఱియును గొన్ని యేమియపరాధంబులు చేసితినో? నేఁ జేసిన యపరాధములకు క్షామక ముగానిప్పుడే మీ తిరుమంత్రోచ్చారణంబు చేయుటచేతను చంచలత్వంబు విడిచి చిత్తము 'శాంతమునం బొందె. మీరే పరతత్వం బని తెలిసి శరణాగతుండనై మీ దాసులలోఁ జేరితిని; నేఁజేసిన యపరాధ ములకుఁ బరిహారముగా మిమ్ము నాకుం జాటి చెప్పిన యాచార్యుల శ్రీపాదతీర్థవిశేషములకుంజేయొగ్గెద; మీదాసుల పాదరక్షలు మోచెద; మీదాసానుదాసుల సేవకుండ నయ్యెద; మీదాసదాసీ జనంబులకు నీళ్లు మోసెద; మీ లెంకలకు లెంకతనంబునఁ జొచ్చి యచ్చువేసికొనియెద; నాసర్వాపరాధంబులు క్షమింపవే; శ్రీ వేంకటేశ్వరా !

58

లంకాపహారీ ! వైష్ణవజ్ఞానం బనియెడీయంజనంబు చేత నీ వనియెడి నిధానం బెత్తికొంటి అదియునుంగాక నీపై భక్తి యనియెడి నావచేత సంసార సముద్రంబు దాఁటి వైరాగ్యంబనియెడి పదార్థంబు నీకు సుంకంబు పెట్టక బలిమిం దెచ్చుకొంటిని. నీ పాదంబులమీఁది తులసీ మాలిక చేత నజరామరపదంబుఁ జాఱగొంటిని. ఇవి నాదుర్జనకృత్యంబులు; నీవు భూమీశుండవు. కనుకఁ నీవునన్నుఁ బ్రమోషంబు సేయకయున్నప్పుడే విన్నవించితి. నేఁ జేసిన చేత లివి; ముందు నీచిత్తం బెట్లుండునో? ఇదిగో నీకు విన్నవించితిని, మఱవక విన నవధరించి రక్షింపవే; శ్రీ వేంకటేశ్వరా !

59

ముచికుందప్రసన్నా ! సంసారధర్మంబు లనియెడు నంగళ్ల లోపల నీతి సంగతులనియెడు వ్యవహారులు కోరిక లనియెడు సరకులు పచరించు కొని అగ్గువతో నమ్మఁగా నేను బహుళంబుగా సంపాదించుకొంటిని.