పుట:Sinhagiri-Vachanamulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

9

స్త్రీ మనోహరా, గోవర్ధనగిరిధరా, మత్స్యకూర్మవరాహ నారసింహ వామన రామరామ రామ బౌద్ధకల్కి దశావతారా, లీలావినోదా, వేణునాదప్రియా, సర్వేశ్వరా, సర్వతోముఖా, సర్వజీవదయాపరా, విశ్వంభరా, విశ్వలోకేశా, త్రిభువనవంద్యా, త్రిగుణాత్మకా, త్రిలోకారాధ్యా, మధుకైటభా(ంబుద) మహాప్రళయ మరుతా, సోమకాసుర హిరణ్యాక్ష హిరణ్యకశిపు నిర్ధూమధామా, సకల దేవతామునిజన మోక్షరక్షకా, గురులఘు క్రమరూపా, కుటిల శిక్షా[1]కారణరూపా, ఓంకారప్రదీపా, అనంతనామకీర్తనా, నాదబిందు కళాతీరా, చరణారవింద గంగోద్బవా, ధ్రువ రోమశవ్యాస మార్కండేయ గౌతమ హృదయ జగజ్జ్యోతి ప్రకాశా, జగదేకవీరా, అమిత రవికోటి తేజా, భాగవత కల్పభూజా, అజామీళ ఘంటాకర్ణ దశధ్వజాళ్వారులకు సాలోక్య, సారూప్య, సాయుజ్య సామీప్య కృపాకటాక్షా, పరమానంద భరితా, అనాథనాథా, దేవతాసార్వభౌమా, అపరిమిత బ్రహ్మాండ రోమకూపా, దుష్టనిగ్రహా, శిష్టప్రతిపాలకా, దేవవేశ్యాభుజంగా, అభయాఽప్రమేయ కృపాంతరంగా, ఓం విశ్వంబులు సృజియించి, బ్రహ్మను అనుభవకర్తనుంజేసి మీ రంతర్యాములై యందుల నుండుదురు. సూక్ష్మచరాచరంబైన మీ దాసులం గాచెచరు. కరుణాజలనిధీ! భూకాంతా! లక్ష్మీసమేతా, సురగణవందితా, (మా) యతి రామానుజ మునివరము, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ.

9

దేవా, శ్రీరామానుజ సిద్ధాంతంబునకు దేవతాంతరమే హాని, చిత్[2]

స్వరూపంబునకు కావ్యమే[3](?) హాని, పదభక్తికి మోహ విడంబమే హాని. మనస్సునకు చలనమేహాని, వితత వ్యుత్పన్నత్వమునకు (స్వర)కళంకమే హాని, స్వామీ, సింహగిరి నరహరీ, మీ దాసుల కాచార్యకటాక్షము లేకుండుటయే హాని. ప్రాణహాని సమయ మందు భగవద్భక్తి మఱువక విష్ణుపురాణములు, హరికథలు దలంచి,

  1. విక్షేప
  2. సిద్ధ
  3. స్వాన్వయమే?