పుట:Sinhagiri-Vachanamulu.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

8

సింహగిరి వచనములు

వజ్ర మస్తక శూలా, కుంభ నికుంభ కుంభకర్ణ కరచణ శిరఃఖండనా, మకరాక్షధూమ్రాక్ష విరూపాక్షితికాయ మహాకాయ చండమదగర్వ సంహారా, ఇంద్రజిత్తు తలగుండు గండా, రావణ గిరివజ్రాయుధా, పంక్తి కంధర శిరఃపంక్తి ఖండనా, లంకా పరిపాలకా, విభీషణ రాజ్యసంస్థాపనాచార్యా, జానకీ సంయోగా, పుష్పకారూఢా, భరద్వాజ విందా, నందిగ్రామ ప్రవేశా, భరత శత్రుఘ్న లక్ష్మణ సమేతా, అయోధ్యా ప్రవేశా, పట్టాభిషేక లోకపావనా, మైథిలీసమేతా, ఆనంద జయ జయ రాఘవేశ్వరా, మాయతి రామానుజా, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

8

దేవా, మధుర నారాయణా, ద్వారవతీనిలయా, కాళింగమర్దనా, కంసాసురమర్దనా, కౌస్తుభాభరణా, శ్రీవత్సలాంఛనా, లక్ష్మీ కుచ కుంకుమ పంకిల వక్షస్థలా, శ్రీయశోదానందనందనా, చాణూరమల్ల ముష్టికాసుర ధేనుకాసుర వనకుఠారా, శకటాసుర ఘోటకాసుర కుక్కుటాసుర మదభంజనా, మహానాట్యవినోదా, మహామునిగణసేవితా, అనురూపా, (అక్షయరూపా), అక్రూర వరదా, గజేంద్ర వరదా, ప్రహ్లాదవరదా,అంబరీషవరదా, ఆపద్భాంధవా, ద్రౌపదీ మానరక్షణా, పాండవపక్షపరాయణా, విదురగృహ విమల భోజన గ్రహితా, ప్రణుత వాల్మీకిసనకసనందన సనత్సుజాత సనత్కుమార కపిల నారదాది పరమ యోగీంద్రవందితా, రాక్షస కుల ప్రళయాంతకా, గరుడధ్వజా, కమలాసన వంద్యా, బృందావన లీలావినోదా, వేణునాదప్రియా, శ్రీమదన గోపాలకా, అచలాచలాణురూపా, అనుపమా, అవ్యక్తగుణానందా, అభవస్వరూపా, ఆదిమధ్యాంతరహితా, అమృతాబ్ధిశయనా, అనంతశయానా, మకరకుండలాభరణా, కిరీటాలంకృతా, కనకపీతాంబరధరా, గరుడ గంధర్వ సమస్తదివ్యయుతా, దివ్యాయుధా, దివ్యమూర్తీ, దిక్పాలకులసేవితా, ప్రలంబాసుర భూతకి ప్రాణనిర్జితా, గాంధారీ పుత్రమిత్ర గహనదవానలా, పరమపురుషా, పరంధామా, పరమ పావనా, కనకాసురాంతకా, శిశుపాల దంతవక్త్ర బకాసుర కోలాహలా, బాణాసుర బాహుఖండనా, భవరోగ వైద్యా, భయనివారకా, షోడశసహస్ర