పుట:Sinhagiri-Vachanamulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

అనే వాక్యం నాటినుండి నేటిదాకా అగ్రవర్ణాల పండితులందరూ సెలవిస్తున్నా అంతరంగశుద్ధి అంత చెప్పుకోతగ్గదికాదేమో అనిపించకమానదు. కృష్ణమాచార్యులు ఈ సూక్తిని అక్షరాలా నమ్మినవారు. సాని సంప్రదాయంతో పాటు నిత్యులతోడి సంపర్గం కూడా ఆయనకుండేదేమో. అయన వివాహ వృత్తాంతమొకటి ఇక్కడ స్మరణీయం. కులశేఖరాళ్వారుల్లాగ ఆయన "ఉన్మస్త భక్తుడు.' తన వివాహానికి సింహగిరిస్వామిని అనుమతి ఆర్ధిస్తే ఆయన తానూ పెళ్ళికి వస్తానంటాడు. పెళ్ళి వారింట్లో పెళ్ళికుమారుడితో పాటు స్వామివారూ "సాపాటు" కు కూర్చొన్నారు.

చరమరహస్యం - పరమరహస్యం

తీరా కన్యాదాత లోపలికి వచ్చిచూస్తే 'అల్లుడు' గారి పక్కనున్న వ్యక్తి చరముడు: దాంతో వర్ణవ్యవస్థను సుదృఢంగా చాలా 'రిజిడ్' గా అనుసరించే ఆయన గారు అల్లుణ్ణి ఇంట్లోంచి గెంటేసి పిల్లను పంపక వెలివేస్తాడు. ఈ చరమ రహస్యం ఒక పరమరహస్యం. ఆచార్యుల వారికి పరముకు చరముడిలో కనబడ్డాడా ! ఆయన మామగారికి పరముడే చరముడిగా కనబడ్డాడా ? ఏమో ! ఇది పరమరహస్యం ! చరమరహస్యం.!! 'హరిజనుల' విషయంలో ఆచార్యులవారి యీ ఆర్ద్రతే వారూ వారి వాజ్మయమూ 'అగ్రవర్ణాలవారికి ' 'వెలి' కావటానికి కారణం కావచ్చును. కృష్ణమాచార్యుల్లాగే హరిజనుల పట్ల ఇంత ఆర్తి నీ ప్రకటించిన మరొకవక్తి శ్రీవైష్ణవ సంప్రదాయంలో 'శ్రీపరస్తుపట్టర్ పిరాన్ జియ్యర్ ' "వీరు సన్యాసులుగా మత ప్రచారంచేసి తృప్తి లేక దూరంగా ఉండి మీరూ మేమూ సమానులం అంటే ఏం బాగుంటుందనుకొని శిఖాయజ్ఞోపవీతాలు పరిత్యంజిచి హరిజనుల్లో కలిసిపోయేరుట. ఇప్పటికీ, వీరి శిష్యులైన నిత్యులు పశ్చిమాంధ్రంలో ఉన్నారట" ఈ సంగతి పూజ్యులు మాఆచార్య చరణులు శ్రీమాన్ న.చ.రఘునాధాచార్య స్వామి వారునాతో అన్నారు. ఆంధ్ర దేశంలో హరిజనుల్లో 'దాసరి' సంప్రదాయంవారున్నారు వీరు వైష్ణవులు. కృష్ణమాచార్య కటాక్షపాత్రు లేమోవీరు. కృష్ణమాచార్య సంకీర్తన సంప్రదాయం వీరిలో ఇంకా ఆడుగంటి కూడా ఉందేమో చూసితత్పరిరక్షణకు వెంటనే పాటుపడాలి.