పుట:Sinhagiri-Vachanamulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

దేశితనాన్ని తాళ్ళపాకవారూ కృష్ణమాచార్యులద్వారా సంగ్రహించుకొని తమ వాజ్మయం వెలయించేరు.

తరువాత వారెవరూ కృష్ణమాచార్యుల్ని స్మరించటం కానీ అనుసరించటంకాని జరిగినట్లు కనబడదు. తాళ్ళపాకవారి వాజ్మయం చిరకాలం అంధకారంలో ఉండిపోయినట్లే కృష్ణమాచార్య వాజ్మయమూ ఏళ్ళతరబడి కాఱు చీకట్లలో కాలం వెళ్ళబుచ్చుతోంది. వేంకటాచల విహారశతక కర్త ఒకడు ప్రాసంగికంగా కృష్ణమాచార్యుల్ని ప్రస్తావిస్తాడు. సింహాచలంతోనూ నరసింహ స్వామి తోనూ స్నిగ్ధ సంబంధం ఉన్న గోగులపాటి కూర్మనాధకవి కూడా కృష్ణమాచార్యుల్ని స్మరించకపోవడం విస్మార్యంకాదు.

దేవాలయాలు - కృష్ణమాచార్యులు

సింహాచలంలోనూ మరికొన్న దేవాలయాల్లోనూ కృష్ణమాచార్య సంకీర్తన వ్యవహారం ఉంది. అధ్యయనోత్సవాదుల్లో ఇతర వేదపురాణాదులకువలె వీటికీ 'సన్నిధివిన్నపం' మర్యాదఉంది. కాని ఇక్కడ శోచనీయం ఏమిటంటే ఆ విన్న విపంబచేవి కృష్ణమాచార్య విన్న పాల్లా కనపడకపోవటం. నామమాత్రంగానే తప్ప మచ్చుకుకూడా ఇక్కడివారికవి తెలియవు. ఇందుకు కారణాలన్వేషించటంలో ఆచార్యసూ క్తిముక్తావళికథవల్లా, సింహ గిరి నరహరివచనాల అంతరంగ సాక్ష్యంవల్లా ఒక రహస్యం బయటపడుతోంది. ఆచార్య శబ్దం పేరులో ధరించి రాజస ప్రవృత్తి తో వ్యవహరించటమే కృష్ణమాచార్య వచనాలు అగ్రవర్ణాలవారికి ఆగ్రాహ్యాలై 'నిత్యుల' పాలవటానికి కారణాలుగా అచార్య సూక్తి ముక్తావళి ప్రకటిస్తోంది, ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి.

కృష్ణమాచార్యుల 'వెలి' రహస్యం

కృష్ణమాచార్యులు వర్ణవ్యవస్థ విషయంలో విప్లావక భావాలు కలవారు. ఒక్క వ్యర్థ వంవస్థలోనే కాదు చాలా సంప్రదాయాల్లో ఆయన స్వాతంత్య్రం ప్రకటించినట్లు 'వచనాల' వల్ల తెలుస్తోంది. వీటికన్నిటికీ ఆయన కాధారం శ్రీ వైష్ణవమే. "శ్వపచోపి మహిపాల విష్ణుభక్తో ద్విజాధికః"