పుట:Sinhagiri-Vachanamulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

వుల వ్యవహారంలో, సింహాచలం నివాస రసికులాయన. 60, 70 వయస్సులో చాలావఱకూ “చాతుర్లక్ష గ్రంథ సంకీర్తసం" పూర్తి చేసుకొని దేశం తిరుగుతూ ప్రతాపరుద్రుడి పరిపాలనా ప్రారంభదినాల్లోనే లేదా అతడు యువరాజుగా రుద్రమదేవి దినాల్లోనే రాజసమ్మానం పొంది ఉండవచ్చును. ఆ తామ్ర పత్రికలు సింహాచలం తెప్పించి వాటి మీద తన వాజ్మయం చెక్కించి సింహగిరి నరహరి శ్రీ భండారానకు సమర్పించి ఉండవచ్చును. శ్రీరంగం వెళ్ళి సింహాచలానికి మళ్ళీ తిరిగివచ్చినట్టూ, సింహాద్రినాధుని శ్రీ భండారానకు “చాతుర్లక్ష గ్రంథ సంకీర్త నలు" సమర్పింప పూనినట్లూ, ఆయన అంతరంగ సాక్ష్యం ఉండనే ఉంది.

ఇక ఆయన నివాసాన్ని గూర్చిన చర్చ

ప్రతాపచరిత్ర కృష్ణమాచార్యులకు ఓరుగంటితో సంబంధాన్ని పేర్కొంటూ ఆయన స్వగ్రామం సంతూరు ' అనీ తరువాత ఆయన 'కల్లూరు' అనే గ్రామం నిర్మించేరనీ చెపుతోంది. 'సంతూరు' లేక 'సంతురు' ఆయన జన్మభూమి అని ఆయన వచనాలవల్ల తెలుస్తోంది. అయితే యీ ‘సంతూరు' ఎక్కడిదన్న ప్రశ్నకు శ్రీ నిడుదవోలు వెంకటరావుగారు తిరునల్వేలి జిల్లాలో (మదరాసు) సంతూరనే గ్రామాన్ని సమాధానంగా ప్రతిపాదించేరు. తెలుగు రచయిత జన్మభూమి తమిళ గ్రామం అవటం, అనటం బాగుండదని డా.కుల శేఖరరావుగారు మహబూబ్ నగర్ జిల్లాలోని సంతపురినే 'సంతూరుగా' నిరూపించటానికి పూనుకొన్నారు. వారి యీ నిరూపణానికి వారు చూఫినకారణాలు రెండు- ఓరుగంటికి సంతపురి దగ్గరగా ఉండటం, 'సంతపురి' వారు వైష్ణవుల్లో ఉండటం ఒకటి. కృష్ణమా కార్యులు నిర్మించే ధనదగిన "కల్లూరు" కూడా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉండటం మరొకటీని. కానీ యీ ప్రతిపాదనం అంత ఔచితీసహంగా కనపడదు. వ్యవహార దృష్టితో కాని భాషాశాస్త్రరీత్యాకానీ సంతపూర్ లేక సంతపురి-సంతపూర్ - సంతఊర్ - సంతూర్-సంతూరుగా మారే అవకాశం, ఔచిత్యం ఉంది అని వ్యత్యస్తంగా-సంతూరు సంతపురి గామారే అవకోళం కనపడదు. ఇహ కల్లూరు సంగతే, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉండవచ్చు