పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11వ అధ్యాయము.

భగవంతునిగూర్చిన పరితాపము.

249. మాయయొక్క బంధనమునుండి తప్పించుకొనుటకు మనము ఏయుపాయములను అవలంబించవలసియుండును? దానిచిక్కులనుండి తప్పించుకొనపరితపించువారికి భగవంతుడే మార్గము చూపును; కాని అందుకు నిరంతర పరితాపము అవాసరము.

250. కొడుకులు పుట్టలేదని ఎందఱో కన్నీరు వరద లై పాఱ రోదనముచేయుదురు. తమకుధనము లంభించలేదని యెందరో దిగులుపడి శుష్కింతురు. కాని, ఆహా! భగవంతుడు కానరాలేదని ఏడ్చి దుఃఖించువారు ఎందరుయుందురో లెక్కించి చూడుడు. మిక్కిలి అరుదుగదా! వెదకువానికి యతడు దొఱకును. భగవంతునికొఱకు ఏడ్చువారు వానిని గనుగొందురు.

251. వానికొఱకై తపించువారు వానిని కనుగొనగలరు; నామాటనిశ్చయము. నీజీవితమున పరీక్షించుము, పొమ్ము. మూడుదినములు ప్రయత్నించుము. సత్యమగు ఆతురపాటు చూపి యత్నించుము. తప్పక నీకు జయముకల్గును.

252. నరుడు ఈశ్వరానుగ్రహమును సంపాదించుకొనవలయిననిన ఈకలియుగములో మూడుదినముల తీవ్రపరితాపముచాలును.