పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

9వ అధ్యాయము.

241. ప్రజలు దోషములనియు, మూఢాచారములనియు పలుకుచు తమపాండిత్యమునుగురించి గర్వపడుచుందురు. కాని సత్యమగుభక్తుడు తనకుసదాభగవంతుడే చేయూతను యిచ్చు చుంటను తెలిసికొనును. తాను చాలకాలముత్రోవతప్పి నడచుచుంటినే అను చింతవానిని బాధించదు. వానికేమేమి అవసరమో భగవంతునికేతెలియును. భగవంతుడే భక్తుని వాంఛితార్ధమునుతీర్చును.

242. అబ్బీ! మామిడిపండ్లుతినరా, అందుము. తోటలో యెన్నివందలమామిడిచెట్లున్నవో, వానికి యెన్ని వేలకొమ్మలుండునో, అందెన్నిలక్షలఆకులున్నవో యనుచు గణితములు వేసిన యేమిలాభము? నీవిక్కడికి మామిడిపండ్లుతినవచ్చితివి; పండ్లుతిను, వెడలిపో! సాధనలుచేసి బ్రహ్మమును సాధించు కొఱకై నీవీలోకమున మనుషుడవైపుట్టితివి. భక్తిని ఆర్జించుట నీయుత్తమాదర్శము. అనవసరములగు వాగ్వాదములతో నీకుపనియేమి? వేదాంతచర్చలు, నీజీవితమును మార్చి వేయగల్గునా? నాలుగుగుక్కలసారాయితో నీకుకైపుఎక్కుచుండగా, సారాఅంగడివాని దాపున ఎన్నిపీపాలసారా ఉన్నదో విచారించుట నీకేమిలాభము? ఈమాత్రము తెలియదా?

243. ఒకనాడు, కేశవచంద్రసేనుడు దక్షిణేశ్వరాలయమునయున్న శ్రీరామకృష్ణ పరమహంసుల వారికడకువచ్చి "పండితులు పెట్టెడుశాస్త్రగ్రంధములనుచదివియు, పరమ పామరులుగ యుండుటకు కారణమేమి?" అనిప్రశ్న వేసిరి.