పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

78

230. ప్రజ్ఞానమయి అగు నాజననికడనుండి ఒక్కకిరణ పనారణము చాలును, మహాపండితాగ్రేసరుని అయినను పడగొట్టివానపాములీల శుష్కీభూతుని చేసివేయగలదు.

231. దేనిసహాయమున మనము బ్రహ్మమును తెలియుదుమో, అదియే పరావిద్య. తక్కినదంతయు - కేవలశాస్త్రములు, తత్వసిద్ధాంతములు, తర్కము, వ్యాకరణము మున్నగువానిరాశియంతయు - మనస్సునభారమై పేరుకొని కలవరమునకు కారణమగును. గ్రంధములన్నియు గ్రంధులవంటివి. (చిక్కులముడులు). పరావిద్యకు దారిచూపినప్పుడే వానివలన ఫలముండగలదు.

232. మనపండితమ్మన్యులు ప్రగల్భములు పలుకుదురు. బ్రహ్మమని, బ్రహ్మయని, అవ్యక్తమని, జ్ఞానయోగమని, వేదాంతమని, విశ్వోత్పత్తియని ఏమేమో వచింతురు. తాము ఉచ్చరించువాని అపరోక్షజ్ఞానమును పడసినవారు పూజ్యము. వారుఎండబాఱి, గట్టిపడి నిష్ప్రయోజకులై యుందురు.

233. చైతన్యదేవుడు దక్షిణదేశమున తీర్ధములు సేవించు చుండ, భగవద్గీతనుచదువు ఒకపండితునికి ఎదురుగానిలుచుండి కన్నీరుకార్చుచున్న భక్తుని ఒకనిని కనిపెట్టెను. ఈభక్తునికి ఓనమాలైననురావు. గీతలోనివాక్యములు వానికి అర్ధమగుటలేదు. అతడు కండ్లనీరుకార్చుటచూచి ఎందుచేత అని ప్రశ్నింపగా ఆతడు యిట్లుచెప్పినాడు.

"నేనుఆగీతలోనిఒక్కమాటనైన తెలియజాలను. నిజము. కాని కురుక్షేత్రయుద్ధరంగమున, రధముపైని, అర్ఝునునికి