పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

9వ అధ్యాయము.

ముందు కూర్చుండి, యీగీత అనబడు ఉత్తమభావములను బోధించుచుండిన యాశ్రీకృష్ణభగవానుని సుందరరూపము నాకండ్లకు అగపడుచున్నది. అందువలన భక్తి ఆనందమువెల్లివిరియ నాకన్నులు బాష్పపూరితములగుచున్నవి."

ఈభక్తుడు ఓనమాలనైనను నేర్వనివాడైనప్పటికిని మహాజ్ఞానియే. ఏమందురా, వానికి నిర్మల దైవభక్తికలదు; భగవత్సాక్షాత్కారమును పొందగలిగినాడు!

234. దివ్యజ్ఞానము, తన పాండిత్యమును గురించిగాని తన ఐశ్వర్యమును గురించిగాని గర్వపడునరునకు సాధ్యముకాదు. అటువంటువానితో "ఒకచోట సాధువొక డున్నాడు. చూచి వచ్చెదము వత్తువా?" అని, అనిచూడుము. ఆతడుసాకులుపన్ని రాజాల ననును. సాధువును చూడబోవుట తనవంటిఘనునకు తగదని ఆతడు భావించును. "అజ్ఞానమువలన గర్వము పుట్టును సుమీ."!

235. పుస్తకములు చదివినగాని జ్ఞానము లభింపదని అనేకులు తలంతురు. శాస్త్రములను చదువుటకన్న వినుటమేలు; బ్రహ్మదర్శనమో ఉత్తమోత్తమము. గ్రంధములను ఊరక చదువుటకంటె గురువునోట బ్రహ్మజ్ఞానముంగూర్చివినుటవలన అది మనస్సున గట్టిగా నాటుకొనును; మఱియు దర్శనము వలన ఆరూఢభావము కుదరగలదు. కాశీనగరమును గురించి పుస్తకములలో చదువుటకంటె ఆనగరమును స్వయముగ చూచినవానినోట దానింగూర్చి వినుటలెస్స. ఆకాశీనితన కండ్లతోనే చూచుట పరమోత్తమము.