పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

77

9వ అధ్యాయము.

యముచేయువానిపోలును. ఆతడుపలుకు పలుకులు వానివి గాక యెరువుతెచ్చుకొనినవిగాన తనకు నష్టములేదని యెంతగానైనను యితరులకు సలహాలను విరివిగా చెప్పగలవాడై యుండును.

227. చిలుక చాలకాలము "రాధాకృష్ణ! రాధాకృష్ణా!" అనుచుండును. కాని దానిని పిల్లిపట్టునప్పుడు కెక కెకలాడును. అప్పుడు దానికి నైజమగువాక్కు బయలుపడును. లోకవ్యవహారదక్షులు లౌకికఫలములను పడయుటకై కొంత హరినామస్మరణచేయుట, క్రతువులు దానధర్మములు సాగించుట కలదు, కానిఏయిక్కట్టులో, బాధలో, దుఃఖమో, దారిద్ర్యమో, మరణమో, వాటిలగానె హరినామస్మరణ మఱతురు; నిష్ఠలన్నియు మూలబడిపోవును.

228. గంజాయి, గంజాయి అని వేయిమారులు అఱచినను నిషాయెక్కదు. గంజాయినితెచ్చి, నీళ్ళలోనూరి, రసము తీసి, తేర్చి త్రాగుము. వెంటనే నిషాకలిగి పడిపోదువు. అటులనే "హరా! హరా!" యని అఱచుటవలన లాభములేదు. శ్రద్ధతో భక్తిసాధనలను కావించినగాని ఈశ్వరదర్శనము కాజాలదు.

229. పామరజనులు ధర్మవాక్కులతో సంచులు నింపి వేతురు. కాని అందు ఒక్కగింజంతయైనను ఆచరణయుండదు. సుజ్ఞానియో వానియావజ్జీవము ధర్మాచరణమే అయినను వానికడ వాచాలతయుండదు.