పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

70

మును సంపాదించుకొనుటకుగాని భక్తిసాధనలచేయుటకుగాని ఎవడును శ్రద్ధవహించడు. జేబులోనిపుస్తకమును ఒకింతచదివినంతటనే ఉపన్యాసములనిచ్చుటకును, ఉపదేశముల చేయుటకును ఎల్లరుపరుగులిడుచుంద్రు. ఎంతవిడ్డూర్యము! యితరులకు బోధచేయుటనగా పనులలోనెల్ల అత్యంతకష్టసాధ్యమగు పని. భగవత్సాక్షాత్కారమునుపొంది వాని ఆదేశమును పడసిన యతడు మాత్రమే బోధలుచేయగలడు.

211. ఆవిరిదీపాలకాంతులు ఆయాస్థలములందువేర్వేఱుగా ప్రకాశించుచుండును. అయినను ఆదీపాల ప్రాణము అనగా ఆవిరి ఒకేగొట్టమునుండివచ్చును. అటులనే ఒక్కసర్వేశ్వరుని వలననే నిరంతరముగా ఆత్మజీవనప్రసారణము యేకసరణిని సాగుచున్ననువేర్వేఱుదీపములవలె, ఆయాదేశకాలములందలి బోధకులు ప్రకాశించుట పొసగును.

212. గొప్పసంపన్నుని ధ్యానాగారమునుండి కొనుగోలు వారికి ధాన్యమునుకొలుచువానివెనుకనుండి తెంపులేకుండ ధాన్యమువచ్చిపడుచునేయుండును. చిల్లరబేరగానిరాశి వేగిరముగ శూన్యమైచనును. అదేతీరున భగవద్భుక్తునిహృదయమునందు సత్సంకల్పములును, సద్బోధలును, భగవంతునిచేతనే సమకూర్చబడుచుండును. అందువలన నూతనములును, జ్ఞానప్రదములును అగుభావములకు కొదువయుండదు. పుస్తకజ్ఞానమునునమ్ముకొనువారుచిన్నబేరగానిబోలువారు. సంకల్పములు భావములు ఎప్పటికప్పుడు వారికి కొఱతపడుచునేయుండును.