పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

69

8వ అధ్యాయము.

లోపల పద్దయ్యజేగంటవాయించుచు శంఖమునూదుచుండుట చూచి ఆశ్చర్యపడిపోయినాడు. గుడిలోనేలంతయు పెంటలతో అసహ్యముగనున్నది. పూజకుదేవతావిగ్రహమాలేదు. అంతట "ఓపద్దయ్యా! గుడిలో మహాదేవునివిగ్రహమాలేదు. గుడినిశుభ్రముచేసి పెంటతొలగించుపాటి శ్రమ నైననుతీసికొనకపోతివి. ఏకాదశదివాంధములు యందుచేరిదివారాత్రములు కీచులుపెట్టుచుండును. అక్కటా, వ్యర్ధముగాశంఖమునూది యింతఅలజడికావించితివెందులకు?" అనిఅతడు కేకలుపెట్టినాడు.

కావున నీహృదయాంతరాళమున దేవతామూర్తిని ప్రతిష్ఠించకోరితివేని, భగవత్సాక్షాత్కారము కావలయునను కోరిక నీకుకలదేని, ఊరకశంఖారావములుచేసిన ఫలమేమి? మొదట నీహృదయమును శుద్ధముచేయుము. హృదయము నిర్మలమైనతోడనే ఈశ్వరుడు తనంతనేవచ్చి అందునిలుచును. దేవతా విగ్రహమును ఆశుద్ధస్థలమున నిలుపవీలుండదు. అయిదు జ్ఞానేంద్రియములును, అయిదుకర్మేంద్రియములును మనస్సునే పైనిపేర్కొనిన ఏకాదశదివాంధములు.

మొట్టమొదలుగా నీఆత్మలో లోతుగమునిగి, అందుగల రత్నములకైకొనుము. తక్కినవి పిమ్మటచూచుకొనదగును. మహాదేవుని ముందు నీహృదయమున నెలకొల్పుము. ఆపిమ్మట ఉపన్యాసములను, ఉపదేశములనుచేయుటకు నీకు కావలసినంత అవకాశముదొఱకగలదు.

210. భక్తిసాగరమున లోతుగమునుగుటకు ఎవనికినిశాంతముగాని అభిలాషగాని యుండదు. వైరాగ్యమును, వివేక