పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65

8వ అధ్యాయము.

భగవంతుని విభూతులనుగుఱించి పుస్తకములందు చదివియుందురుగాని, తమ జీవితములలో ప్రత్యక్షానుభవమును పొందియుండరు. మఱియు మంచుగడ్డనుచూచినవారిలో అనేకులు దానిని రుచిచూచియుండనితీరున భగవన్మహిమలను లీలగా తెలిసికొనిన వారనేకులు, వానితత్వమును సరిగా గ్రహించియుండరు. మంచును రుచిచూచినవాడే అదెట్టిదైనది చెప్పగలడు. అటులనే ఒకప్పుడు సేవకుడుగను, మఱొకప్పుడు సఖుడుగను, వేఱొకప్పుడు ప్రియుడుగను వివిధములుగా భగవద్విభూతులను వానితోడి సంసర్గముచేత గ్రహించినవాడుమాత్రమే వానినన్నింటిని వర్ణించగలడు.

199. మేడకప్పులపైనపడు వాననీరు, అందు పులితలల ఆకారమున అమర్చబడియున్నగొట్టముల ద్వారమునవచ్చునప్పుడు; పులులచేత క్రక్కబడునటుల కాన్పించినను, సత్యమునకు అది ఆకాశమునుండివచ్చు జలమే. అదేతీరున సాధుజనుల నోటిగుండవెలువడు సద్బోధలు వారిచే పలుకబడు పలుకులుగ కాన్పించినను సత్యమునకు అవి భగవత్సానిధ్యమునుండి వెలువడివచ్చు సూక్తులే సుడీ!

200. ఈనాటిమతబోధకులు అవలంబించు పద్ధతిని గురించి మీఅభిప్రాయమేమి? ఒక్కనికి సరిపోవువంటచేసి నూరుమందిని భోజనమునకు పిలుచుతెరవుననుండును. కొలదిపాటి ఆత్మానుభవముతో మహాధర్మోపదేష్టలుగ నటించుచున్నారు.

201. సత్యమగు ఉపదేశము ఎటులుండును? ఇతరులకు భోదలుచేయుటకంటే, నిరంతర భగవ