పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

66

త్సేవచేసిన చాలును; అదేబోధయైమించును. తనముక్తికై యెవడు సప్రయత్నడగునో ఆతడునిజముగా ఉపదేశికుడే. పలుదిక్కులనుంచి వందలకొలది జనమువచ్చి జీవన్ముక్తునికడ చేరుదురు; వానిఉపదేశమును వినుటకై ఆతురపడుచుందురు. రోజాపువ్వు విప్పుకొనగానే ఆహ్వానములు పిలుపులు ఏమియు లేకుండనే తేనెటీగలు అన్నివైపులనుండియువచ్చి మూగ గలవు.

202. స్మశానవాటియందు మృతకళేబరము నిశ్శబ్దముగను నిశ్చలముగను పడియుండును. రాబందులును, గ్రద్దలును అనేకము తమంతటతామే వచ్చిచేరును. వానిని పిలుచుకొని వచ్చుటకు యెవరును పోనక్కరలేదు.

203. మంటమండునప్పుడు పురుగులు ఎగురుచువచ్చి దానిలోపడిపోవును. అవెక్కడినుండివచ్చునో ఎవరికినితెలియదు. పురుగులను పిలుచుటకై నిప్పు తిరుగులాడదు. మహాత్ములబోధయు యిట్లుజరుగును. వారుపోయి వారిని వీరిని పిలుచుకొనిరారు. వందలకొలదిప్రజలు వారికడకువత్తురు. ఎక్కడినుండియో తెలియదు వారు తమంత తామేవచ్చి ప్రబోధమును కోరుచుందురు.

204. మిఠాయిరాలిన చోటునకు చీమలు తమంతతామె గుమిగూడును. పరమార్ధతత్వమను మిఠాయిగా మీరు మారుడు; భక్తులనుచీమలుతమంతటతామెవత్తురు. భగవంతుని ఆదేశములేకుండ నీవు భోదలుసాగించితివా అవి నిస్సారముగ నుండును; ఎవరునువినరారు. భక్తిద్వారమునగాని, మఱే