పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

32

"మ" అనగా ఈశ్వరుడు;"ర" అనగాజగత్తు అనిఅర్ధము, ముందు భగవంతుడు; పిమ్మట జగత్తు!

103. నిర్గుణబ్రహ్మమును సగుణబ్రహ్మమును ఒక్కటే, బేదము లేదు. ఒకదానియందలి విశ్వాసము కుదిరిన, రెండవదాని యందలి విశ్వాసము కుదిరినట్లే. కాల్చుశక్తిని కాదని నిప్పునుగూర్చి ఊహింపజాలము. నిప్పును స్మరింపకుండ కాల్చుశక్తిని భావనచేయజాలము. ఇట్లే సూర్యునివిడిచి వానికిరణములను, వానికిరణములనువిడిచి సూర్యునిభావన చేయజాలము. పాలను విడిచి పాలతెల్లదనమును, పాల తెల్లదనమునువిడిచిపాలను ఊహచేయజాలము. అదేవిధముగా సగుణుడగుభగవంతుని భావనలేకుండ నిర్గుణబ్రహ్మమునుగాని, నిర్గుణముయొక్క సంపర్కములేకుండ సగుణబ్రహ్మమునుగాని భావనచేయుట అసంభవము.

104. ఇది సంవృత వివృతధర్మము. పరబ్రహ్మము దిశకు మరలి పోదువా వానిలో నీవ్యక్తిత్వము లయమగును. ఇది సమాధి! ఆపిమ్మట ఈభావమునుండిమరలి, నీవెచ్చట నుండి బయలుదేరితివో, అచ్చటికి వచ్చితివా, నీవును ఈ జగత్తుగూడ ఆ పరబ్రహ్మమునుండియే వివృతమైవచ్చినట్లును, ఈశ్వరుడు, జీవుడు, జగత్తుఅభేదమేఅనియు, అందువలన వీనిలో దేనినిసాక్షాత్కారముచేసికొనినను తక్కిన రెంటిని దర్శించినట్లేఅనియు తెలియవచ్చును.

105. అనంతజలరాశి యున్నట్లూహచేయుము. పైననీరు, క్రిందనీరు, అన్నిదిశలందును నీరే వున్నదనుకొనుము. కొన్ని