పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

2వ అధ్యాయము.

కంటెను, బాహ్యజగముకంటెను అనంతాంశములుగా యధార్థములు.

99. సాకారబ్రహ్మదర్శనము తఱచుగా పారమార్ధికరూపమున నుండును. వినిర్మలనరహృదయమునకు మాత్రమే గోచరించును. అనగా ఈరూపములు ఈశ్వరుడు ప్రసాదించు భగవతీతనువునకు సంబంధించిన జ్ఞానేంద్రియములకు మాత్రమే గోచరించును. కావున సిద్ధపురుషుడు మాత్రమే వీనిని చూడగలుగును.

100. నీవు అద్వైతమునుగూర్చిమాట్లాడిన తోడ్తోడనే, ద్వైతమును ప్రతిపాదించినవాడవగుచున్నావు. అఖండమును గూర్చి ప్రస్తాపించునప్పుడు ఖండమును అంగీకరించినవాడవే అగుచున్నావు. సమాధియందు నీవు పరిపూర్ణమును దర్శించువఱకునునీవు "పరిపూర్ణము" అనునదివ్యర్ధవాక్కు కాకపోయినను సాపేక్షికరూపమైనను అగును. దానిని ఉన్నదున్నట్లు నీవువర్ణింపలేవు. అటుల వర్ణనచేయు ప్రయత్నమునందే నీవ్యక్తిసంబంధమగు రంగునొకదానిని, దానియందు లేనిదానిని, దానికంటించినవాడవగుచున్నావు.

101 బ్రహ్మము జ్ఞానాజ్ఞానములకును, శుభాశుభములకును, ధర్మాధర్మములకును, ఇంతేల ద్వంద్వములన్నింటికిని అతీతముగనుండును.

102. ముందు భగవత్సాక్షాత్కారము, పిమ్మట వానిసృష్టిజ్ఞానము! వాల్మీకికి రామమంత్రము నేర్పునప్పుడు దానిని తలక్రిందుచేసి 'మరామరా" అని నేర్పవలసివచ్చెను.