పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

364

చున్న నాకు అన్యసంకల్ప మెటుల రాగలదు?" అని నారదుడు పలికెను. అంతట శ్రీహరి యిటుల మందలించెను:_ "ఈ ఒక్కగిన్నె నిన్ను నన్ను పూర్తిగ మఱచునటులచేసి, నీమనస్సును అన్యధా లాగివేసినది! ఆసేద్యగాని స్థితిచూడుము! అంతులేని సంసారభారమును మోయుచును గూడ ప్రతి దినము రెండుతడవలు నన్ను సంస్మరించును గదా!"

971. ఒక బ్రాహ్మణుడు తన శిష్యుడున్న ఒకానొక గ్రామమునకు పోవుచుండెను. వానివెంట సేవకులెవరును లేరు. త్రోవలో నొకమాదిగవాడు కాన్పించగా ఆయన వానితో నిట్లనెను. "ఓయీ! నీవు నాసేవకుడవుగానుండి నాతోడ వచ్చెదవా? నీకు చక్కనితిండి దొఱకును; నిన్ను బాగుగ పోషించెదను. రమ్ము!"

ఆ మాదిగవాడిట్లనెను:- "పూజ్యుడవగు దేవా! నేను నీచజాతివాడను; నీ సేవకుడనిని యెట్లు చెప్పుకొనగలను.

ఆ బ్రాహ్మణుడు అందుమీద, "నీకు సంశయమేల? నీవెవ్వడవో యెవరికిని తెలుపకుము; ఎవ్వరితోడను మాటాడవద్దు; ఎవరి పరిచయమునుచేసికొనకుము" అనగా ఆతడు ఒడంబడినాడు. సాయంసమయమున ఆబ్రాహ్మణుడు శిష్యునింటిలో ధ్యాననిష్ఠయందుండగా, వేఱొకబ్రాహ్మణుడు వచ్చి ఈబ్రాహ్మణుని సేవకునితో "ఓరీ! నీవు లోనికిపోయి నా చెప్పులను తెచ్చిపెట్టుము" అనెను. ఈసేవకుడు తన యజ