పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

365

41వ అధ్యాయము.

మానుని యుపాయము ననుసరించి మా రాడక యుండెను. ఆబ్రాహ్మణుడు మఱొకసారి పలుకరించినాడు. అప్పుడును వాడూరకుండెను. ఆబ్రాహ్మణుడు చాలాసార్లు వానిని పలుకరించసాగెను; కాని వాడుమాట్లాడడయ్యెను. తుదకా బ్రాహ్మణుడు విసిగి ఆగ్రహముచెంది "ఓరీ! నీవు బ్రాహ్మణుని ఆజ్ఞను తిరస్కరించుటకు సాహసించితివే! నీపేరెయ్యది! నీవు నిజముగా మాదిగవైయుందువు!" అనెను.

ఈ మాదిగవాడాపలుకులను విని గజగజ లాడుచు తన యజమానునితో దీనముతో నిట్లనెను. "మహాప్రభూ! నాగుట్టు తెలిసిపోయినది. నేనింక నిక్కడ నుండజాలను. నన్ను చచ్చఱపోనిండు." ఇట్లు మనవిచేసి తక్షణమే కాళ్ళకు బుద్ధిచెప్పినాడు. ఇదేతీరున మాయ తనగుట్టు బయటపడిన తోడ్తోడనే పరుగిడిపోవును.

972. "అది త్వరలో జరుగును" "జరుగబోవుచున్నది". "ప్రారంభముచేయుచున్నాను"-

ఈరీతిగా పలుకుచు జాగుచేయుటవలన వైరాగ్యము మందగించును. ఎవ్వని హృదయమున వైరాగ్యాగ్ని ప్రజ్వరిలుచుండునో, ఆతడు బిడ్డకొఱకై పరితపించు తల్లినిబోలి, భగవంతునిగూర్చి తల్లడిల్లును. ఆతడు భగవంతుని వినా ఏమియు కోరదు. ప్రపంచము అంచుగోడలేని నూతివలె వానికి గోచరించును. యెప్పుడు దానిలోపడిపోదునో అని యతడు బహుజాగరూకుడై మెలగును; ఇతరులవలె "ముందు నా సంసార విషయముల నన్నిటిని చక్కచేసికొననిండు;