పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

363

41వ అధ్యాయము.

ముననున్న బ్రహ్మము పైనుండి నీకు హెచ్చరిక చేసెనుగదా? ఆబ్రహ్మముమాటనీవేల చెవినిబెట్టవైతివి?" అని మందలించెను.

970. ఒకసారి నారదుడు తనకుమించిన భక్తుడులేడను గర్వమును పొందెను. వానిభావమును గ్రహించి శ్రీహరి యిట్టులనెను. "నారదా! అల్లదిగో నీవాగ్రామమునకు పొమ్ము. అచ్చట గొప్పభక్తుడొకడుకలడు. వానిపరిచయము చేసికొనుము. అతడు నాభక్తుడు."

నారదుడాయూరికిపోయి ఒక వ్యవసాయకుని కనుగొనెను. ఆతడు ఉదయముననేలేచి ఒక్కసారి హరీ! అనుచు నాగలినితీసికొని పొలమునకుబోయి దినమంతయు నేలదున్నుచుండును. రాత్రివేళమరల ఒక్కసారి హరీ! అని పరుండును. నారదుడిట్లు తలంచెను; "ఈమోటుమానిసి భగవద్భక్తుడెట్లు కాగలడు? వీడు దినమంతయు తీరికలేక పనులుచేయుచుండును. భక్తుని చిహ్న లెవ్వియు వీనియందు కానరావు."

అంత నారదుడు తిరిగి శ్రీహరిని సమీపించి తాను చూచివచ్చిన విషయమును తెలిపెను. ఆపలుకు లాలకించి శ్రీహరి "నారదా! ఈ నూనెగిన్నెను తీసికొని పట్టణమును చుట్టిరమ్ము. ఒక్కచుక్కయైనను గిన్నెనుండి పడరాదు సుమీ! అనిచెప్పెను. నారదుడటులచేసి తిరిగివచ్చినప్పుడు "నారదా! ఈపట్టణముచుట్టు నీవు నడచునప్పుడు త్రోవలో నీవు నన్ను యెన్నిమారులు తలంచుకొంటివి?" అని అడిగెను. "స్వామీ! ఒక్కసారియు అటులచేయ లేదు. అంచులదాక నిండియున్న ఈగిన్నెను కనిపెట్టి చూచు