పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

362

స్వామీ! మీబోధననుసరించి నేనెవరిని హింసించకుండుటే కారణము కటా! వారెంతయు క్రూరులైవర్తించుచున్నవారలు" అనెను. యోగినవ్వి యిట్లుపలికెను:- "మిత్రమా! నేను ఎవరిని కఱవవద్దని చెప్పితినిగాని, ఎవరిని భయపెట్టవలదంటినా? నీవేజంతువును కఱవకున్నను, బుస్సుకొట్టి ఎవరును నీదఱికిరాకుండ నుంచగల్గుదువే."

అటులనే మీరు సంసారులై జీవించునెడల బెదరించువారును, గౌరవపాత్రులునునై యుండవలయును. ఎవరికిని హింస కలిగింపకుడు; మఱియు ఎవరివలనను హింసలను పొందకుడు.

969. "సర్వము బ్రహ్మమేన"ని గురువు బోధించెను. శిష్యుడు దానిని అక్షరతః అర్థముచేసికొని, దాని అంతరార్థమును తెలియడయ్యెను. ఒకనాడు రాజవీధినిపోవుచుండగా వానికి ఏనుగొకటి ఎదురయ్యెను. పైనున్నమావటివాడు "తొలగుడు; తొలగిపొండు" అని అఱచుచుండెను. బ్రహ్మచారి "నేనేల తొలగిపోవలెను? నేను బ్రహ్మమను; ఆఏనుగును బ్రహ్మమే. బ్రహ్మమునకు బ్రహ్మమువలననే అపాయమేమి రాగలదు? అని తర్కించుకొనసాగెను; అటుల తర్కించి దాఱి తొలగడయ్యె. తుదకు ఏనుగు వానిని తొండముతో పట్టుకొనిప్రక్కకువిసరివేసినది. బ్రహ్మచారికిగాయములుతగిలినవి. కొంతవడికి ఎట్టెటోగురువునుసమీపించి తనపాటునంతను వివరించి చెప్పినాడు. గురువామీదట "మంచిదే! నీవు బ్రహ్మవు; ఆఏనుగును బ్రహ్మము! కాని మావటివానిరూప