పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

360

967. ఒకగొల్ల, ఏటి కావలియొడ్డున నుండు బ్రాహ్మణునకుపాలు తీసికొనిపోయియిచ్చుచుండేది. పడవ సరిగానడువని కారణమున ప్రతిదినమును సకాలమున పాలందీయలేకుండెను. ఒకనాడా బ్రాహ్మణుడు చివాట్లుపెట్టగా "అయ్యో, నేనేమిచేయుదును? ఇంటికడనుండి పెందలకడనే బయలుదేఱి వచ్చితిని. ఏటియొడ్డున పడవవానికొఱకును, పడవదాటువారందఱు చేఱుకొఱకును కనుపెట్టుకొని కూర్చుండవలసివచ్చినది" అని సమాధానము చెప్పినది. అంతట నాబ్రాహ్మణుడు "భగవన్నామము నుచ్చరించిన జన్మసాగరమునే దాటవచ్చునే నీవీచిన్ననదినిదాటలేవా?" అనెను. నిష్కపటహృదయయగు గొల్లది ఏరుదాటునుపాయము సులభముగా దొఱికినదని ఆనందమును పొందినది. మరునాటినుండి ప్రతిదినమును అరుణోదయ సమయమునకే పాలందించుచుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు ఆగొల్లదానితో "ఏమిది? నీవింత పెందలకడ వచ్చుచున్నావే?" అనెను. "అయ్యా! మీరుచెప్పినటుల స్వామిపేరు తలంచుకొంటూ ఏరుదాటివచ్చుచున్నాను. పడవతో పనిలేదుగదా!" అని గొల్లది చెప్పినది. బ్రాహ్మణుడు ఆపలుకులు నమ్మలేకపోయెను. "నీవు ఏరెట్లు దాటినావోచూపెదవా?" అని అడిగినాడు. ఆస్త్రీ బ్రాహ్మణుని తనతోతీసుకొనిపోయి నీటిమీద నడిచిపోసాగెను. వెనుకకుతిరిగిచూడగా బ్రాహ్మణుని దురవస్థతెలిసెను. "అదేమిటండీ? నోటితో భగవన్నామమును పఠించుచు చేతితో బట్టపైకెట్టిపట్టుకొందురేమి? తడియుననియా? మీరు పూర్తిగాదేవునిపైనాధారపడియుండరేమి?" అని గొల్లది ప్రశ్నించెను. స్త్రీగాని పురుషుడుగానిసలుప