పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

361

41వ అధ్యాయము.

గల్గు అలౌకికచర్యలరహస్యము వారు పూర్ణముగను సుస్థిరముగను భగవంతునిపై విశ్వాసముంచుటలోనున్నది.

968. ఒకచోటున పామువసించుచుండెను. ఆవైపుగా పోవుటకు ఎవరును సాహసించెడివారుకారు. ఏమన ఎవరేని అచ్చోటికిపోయిరా అది తక్షణమే కఱచి చంపెడిది. ఒకనాడు మహాత్ముడొకడు ఆత్రోవనుపోగా పాము వానిని తఱుముకొనిపోయి కరువజూచెను. కాని అదివానిని సమీపించగనే తన భీకరస్వభావమును గోల్పోయి ఆయనయోగమహిమకు వశమైపోయినది. అప్పుడు దానినిచూచి యోగి "మిత్రమా! నీవు నన్ను కఱవనెంతువా? అనెను." పాము సిగ్గుపడి మిన్నకుండెను. తుదకాయన "ఇటువినుము, సోదరా! ఇకమీదట నీ వెవరిని హింసింపకుము" అనిబోధించెను. పామును శిరమువంచి అందుకొడంబడెను. యోగి వెడలినాడు; పాము తన కలుగున ప్రవేశించినది. అప్పటినుండి అది నిరపాయకర జంతువై, ఎవరిని బాధింపనెంచక పావనజీవనమును గడపు చుండెను. కొలది దినములకే చుట్టుపట్టుల వారెల్లరును ఆపామువిషము వమ్మయ్యెననియు, చెంతకుపోయిన అపాయములేదనియు చెప్పుకొనుచు దానిని పలువిధముల పీడించసాగిరి. కొందఱు రాళ్లు రువ్విరి; కొంద`రు క్రూరత తోకబట్టియీడ్చిరి; ఈవిధముగా దానిబాధలు వర్ణించనలవి కాకుండెను. అదృష్టవశమున యోగితిరిగి ఆమార్గముననేవచ్చి గాయములచే కృశించియున్న పాముదుర్దశనుగాంచెను. చాల జాలిచెంది హేతువేమని యడిగెను! అందుకాపాము