పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

336

యుండలేదు. ఈవేశ్య కాయికముగ పాపమాచరించినను రేయింబవళ్లు భగవంతుని పూర్ణ హృదయముతో ప్రార్థించినది. జనులచేత నీశరీరమును, ఆమెశరీరమును ఎటుల చూడబడెనో యోచించుము. నీవెన్నడును శరీరముతో పాపముచేయలేదు గాన నీశరీరమును వారు పూలతోడను మాలలతోడను అలంకరించి, మేళతాళములతో ఊరేగించి పుణ్యనదిలో విడువబోవుచున్నారు! ఈ వేశ్యశరీరము పాపమాచరించియున్నదిగాన ఈక్షణమున నదికాకులచేతను గ్రద్దలచేతను చీల్చివేయబడుచున్నది. అయినను ఈమెహృదయము పవిత్రవంతమైయుండె గాన పావనలోకములకు బోవుచున్నది. నీహృదయము సదా ఆమె పాపకార్యములనే మననము చేయుచుండె గాన అపవితమైనదై అపవిత్రుల లోకమునకే పోవుచున్నది. యధార్థమున వ్యభిచారివి నీవుగాని, ఆమె కాదు!"

947. ఒకబ్రాహ్మణుడు తోటను వేయించుచుండెను. రాత్రింబవళ్లు దానిని జాగ్రత్తగా కనిపట్టి చూచుచుండెను. ఆతడు అత్యంత ప్రీతితో రక్షించుచున్న మామిడిమొక్కను ఆవొకటి తోటలోపడిమేసినది. తనకు ప్రియముగానుండిన ఆమొక్కను ఆవు మేయుచుంట చూడగానే బ్రాహ్మణునికి రౌద్రము రగుల్కొనివచ్చెను. అంతట బడితెతీసికొని మోదగా ఆయావు గాయములచేచచ్చిపడినది. బ్రాహ్మణుడు గోహత్యచేసినాడను వదంతి ఎల్లెడలవ్యాపించినది. ఈబ్రాహ్మణుడు వేదాంతిననిప్రకటించుకొనుచుండెడివాడు. గోహత్య దోషమునుతనపైనారోపించగానే, తానునిర్దోషినని రుజువు