పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

337

41వ అధ్యాయము.

చేయుటకుగాను ఇట్లుపలుకసాగెను:- "కాదు కాదు" నేను గోహత్యచేయలేదు. ఆపని చేసినది నాచేయి సుడీ! ఈహస్తమునకు అధిష్ఠానదేవత యింద్రుడు; కావున ఎవరేని ఆవును చంపినదోషముకట్టు కొందురేని అది ఇంద్రునిదిగాని నాదికాదు."

స్వర్గమందలి యింద్రుడీపలుకులు వినినాడు. ఒకవృద్ధబ్రాహ్మణవేషమును ధరించి ఈతోటస్వంతగాని కడకు వచ్చి యిట్లు ప్రసంగించ నారంభించినాడు:-

ఇంద్రుడు :- అయ్యా! ఈతోట ఎవరిది?

బ్రాహ్మణుడు:- నాయదియే.

ఇంద్రుడు:- ఇది చాల సుందరముగానున్నది. కడునేర్పరి యగు తోటమాలిని మీరు సంపాదించియుందురు. ఆహా! ఎంతసొగసుగా, ఎట్టి చిత్రవిచిత్రారములతో మొక్కలను నాటించినాడో!

బ్రాహ్మణుడు:- ఇదంతయు నాపనియేనండీ! ఈచెట్ల నన్నింటిని నేను స్వయముగ పరీక్షించుచు స్థలనిర్ణయముచేసి పాతించి పోషించుచుందును.

ఇంద్రుడు:- అటనాఅండీ! మీరు మహా నిపుణులండీ! బహు బాగుగ చిత్రాకారముల కల్పనచేసి మొక్కలను పాతించినారు.

బ్రాహ్మణుడు:- అంతయు స్వయముగనే చేసినదే!

ఇంద్రుడు:- (చేతులుజోడించి) ఈతోటలోజరిగిన పనులన్నియు నీయవియేయని, వానింగూర్చిన ఘనతనంతను నీవే