పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

338

గైకొనుచుంటివి గదా! అవునుచంపిన దోషమును మాత్రము, పాపము, ఆయింద్రునినెత్తిన పడవేయుట చాల అన్యాయము సుమీ!"

948. నవనాగరిక విద్యావంతుడొకడు సంసారులు ఐహిక తత్పరులుగానుండక తప్పదని శ్రీపరమహంసులవారితో వాదించసాగెను. అప్పుడు శ్రీపరమహంసులవారిట్లనిరి:-

"ఈనాటి సంసారుల ఔదార్యము ఎటువంటిదో తెలియునా? ఒకబ్రాహ్మణు యాచనకువచ్చినయెడల గృహయజమాని తనభార్యయే యింటి వ్యవహారములన్నియు చక్కబెట్టుచుండునుగాన, తాను డబ్బువిషయములేవియు పెట్టుకొనడుగానను, గృహకృత్యముల జోక్యములేనివాడు గానను, ఆబ్రాహ్మణునితో "అయ్యా! నేను డబ్బు తాకువాడనుగాను; నన్ను యాచించవచ్చి నీవు వృధాకాలయాపనచేసికోనేల? అనును. ఆబ్రాహ్మణుడు అతిదీనముగా ప్రార్థించుచు పీడించువాడైన యెడల "సరే, రేపురండయ్యా; ఏమైనవీలుంటే చూచెదను" అని చెప్పును. ఈఅధర్మమూర్తియగు గృహస్థు, ఇంటిలోనికిపోయి, భార్యతో "ఓసీ, చూచితివా! పాపము ఒక పేదబ్రాహ్మణుదు, చాల కష్టదశలోనున్నాడు. ఒకరూపాయి యిత్తము" అనును. "రూపాయి" అనుమాట చెవినిబడగానే భార్య రుద్రాణి రూపుదాల్చి, "ఆహా! ఎంత ఔదార్యమండీ! రూపాయలు పుల్లియాకులో రాళ్లో అనునటుల మీకు కాన్పించుచున్నవి కాబోలు! వెనుక ముందు చూడనక్కఱలేదు; పాఱవేయ