పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

324

చుండును; అది మేల్కాంచినప్పుడు సుషుమ్నయందు ప్రవేశించి, స్వాధిష్ఠానమణిపూరకాది పద్మములగుండపోయి, తుదకు సహస్రారము చేరును. అప్పుడుసమాధిదశ లభించును. నాకిదంతయు స్వానుభవమున తెలిసినది.

937. నిశ్శబ్దముగనుండు స్థలమునజేరి, హరినామమును పలుకుచుండుట జపమనబడును. ఇట్లొకడు ఎడతెగకుండ హరినామస్మరణను నిండుభక్తితోచేసెనేని తుదకు వానికి భగవద్విభూతులు గోచరములగును. బ్రహ్మసాక్షాత్కారమును లభించును. ఒడ్డునకు ఒకకొనతగిలించియున్న పొడువగు గొలుసుకొనను పెద్దదుంగకట్టబడి నీటిలోపలమునిగియున్నది. ఆగొలుసుపట్టుకొని, కడియములను తడవుకొనుచు పోతివేని నీవాదుంగనుచేరగల్గుదువు. అటులనే ఒకడు జపముసలుపుచు దైవధ్యానమున మునింగిపోయినయెడల తుదను భగవంతుని ప్రత్యక్షము చేసికొనగల్గును.