పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

323

40వ అధ్యాయము.

ఎవరిట్లుచేసిరి! ఈమొదలగుభావములు స్ఫురించును. మహమ్మదీయులు సాయంకాలమునందు పనులన్నియు మానివేసి నమాజునకుకూర్చుండుట చూడలేదా?

931. నీవు భగవంతునకు ఏమిఅర్పణచేసినను నీకు వేయిరెట్లు తిరిగియొసగబడును. కావున సర్వకర్మలందును తుదిని ఆకర్మఫలమును కృష్ణార్పణముచేసి నీళ్లువిడువవలయును.

932. యుధిష్ఠిరుడు తనపాపములనుసయితము కృష్ణార్పణముచేయబోగా "వలదు, వలదు. అటులచేయకుము. నీవుశ్రీకృష్ణునకు దేనిని అర్పణచేసినను అది వేయియంతలై తిరిగి నీకువచ్చును" అని భీముడు హెచ్చరించినాడు.

933. ఒకడు ధ్యాననిష్ఠలను ఇతరులకు తెలియరాకుండ ఎంతరహస్యముగచేసిన అంతలాభకరము.

934. భగవంతుడు అనేకరూపములుతాల్చి ప్రసన్నుడగును; ఒకప్పుడు నరరూపమునను, ఒకప్పుడు చిన్మయరూపమునను ప్రసన్నుడగును. కాని ఈదివ్యస్వరూపములందు విశ్వాసముండవలయును.

935. శ్రీకృష్ణుడుసయితము రాధాయంత్రముతో మహాసాధనలుచేసియున్నాడు. ఈయంత్రమే బ్రహ్మయోని - దాని ధ్యానార్చనలు సాధనచేయవలయును. ఈబ్రహ్మయోనినుండి అనంత బ్రహ్మాండములు ప్రభవించును!

936. కుండలిని ప్రబోధముకాంచినగాని ఆత్మప్రబోధము కలుగదు. కుండలినీశక్తి మూలాధారకమలమున నిద్రించు