పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

317

40వ అధ్యాయము.

నది అదియే. ఆత్మ అనబడునదియే పంచభూతములుగ మారినది. ఈభూమి ఆత్మయైనచో, ఇంత గట్టిగానుండుటేలనని నీవు ప్రశ్నించబోదువు. కాని భగవంతుని యిచ్ఛకు ప్రతిదియు సాధ్యమే. రక్తము వీర్యము కూడి మాంసము శల్యమును ఏర్పడుటలేదా? సముద్రపు నురుగు ఎంత గట్టిపడుటలేదు!

910. భగవత్సాక్షాత్కారము లభించినపిమ్మట జగత్తు మిధ్యగాకాన్పించును. బ్రహ్మమునుచేరిన యతడు, ఆబ్రహ్మమే ఈసర్వమును - జీవులును జగత్తును - అయ్యెనని తెలిసికొనును. అటువంటివాడు తనబిడ్డలకు అన్నముపెట్టునప్పుడు, శ్రీగోపాలకృష్ణునికే అన్నముపెట్టుచున్నటుల భావించును; తన తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులనుగనెంచి వారికి సేవలొనర్చును. బ్రహ్మసాక్షాత్కారమును పొందిన యనంతరము ఎవడేని గృహస్థుడుగనుండి సంసారముచేసినను, భార్యతోసంభోగించబోడు. భార్యాభర్తలిరువురును భక్తులై జపతపములతో కాలముగడుపుదురు. సర్వభూతములందున బ్రహ్మమేయుండుట నెఱిగి వారు సకలప్రాణులను సేవింతురు; అన్నిటియందును పరమాత్మనే పూజింతురు.

911. ఒక శిష్యుడు:- "నిజముగా సాధువైనవానిని గుర్తించుట ఎట్లు?

శ్రీపరమహంసులవారు:- "ఎవనిహృదయమును ఆత్మయు పూర్ణముగ భగవదర్పితములైయుండునో అతడు నిజమగుసాధువు. కామినీకాంచనములను త్యాగముచేసిననాడు