పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

318

నిజమగుసాధువు. నిజముగాసాధువైనవాడు స్త్రీని మోహముతో చూడడు. ఆతడు స్త్రీ యనిన దూరముగానుండును; సమీపమునకురాతటస్థించినయెడల ఆమెను తనతల్లిగాభావించి గౌరవముచేయును. నిజమగుసాధువు నిరంతరము దైవధ్యానము చేయుచుండును; సర్వమునందు బ్రహ్మముకలడను భావనతో సకలభూతములను సేవించును. సాధువులందివి సామాన్యలక్షణములు."

912. శరీరము నిర్మాణమైనది; వినాశమును పొందును కాని ఆత్మకు మరణములేదు! పోకకాయ పోలిక:- పోకకాయ పక్వమైనప్పుడు లోపలి గింజ పై డొల్లనుండి విడిపోవును. కాని పచ్చిగానున్నప్పుడు ఆవిత్తును పచ్చని బెరడును విడదీయుట దుర్లభము. బ్రహ్మమును చేరినప్పుడు అనగా బ్రహ్మసాక్షాత్కారమును పొందినప్పుడు - ఆత్మ శరీరమును నుండి భిన్నమను జ్ఞానము కలుగును.

913. ధ్యానమునందు ఏకాగ్రచిత్తత కలిగి పిమ్మటఏమియు కనబడక, వినబడకయుండును. దృష్టియు స్పర్శజ్ఞానమునువిడిచిపోవును, శరీరముమీదుగా పాము ప్రాకిపోయినను తెలియరాదు! ఆవిషయము ధ్యానముచేయువానికి తెలియదు; పామునకును తెలియదు!

914. తీక్షణ ధ్యానమునందు యింద్రియ ధర్మములన్నియు ముకుళితములై పోవును. మనస్సుయొక్క బాహ్యప్రసారణము పూర్తిగ ఆగిపోవును. బహిద్వారము కట్టుబడిపోయినట్లగును. జ్ఞానేంద్రియాను భవములైదును - శబ్ద స్పర్శ రూప రస