పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

316

908. "నేతి, నేతి!" అనుచు విశ్వమును దాటిపోయి, ఆత్మపరోక్షానుభూతిని పొందుటేజ్ఞానము. విచారముచేయుచు పోయి దృశ్యజగమును బుద్ధినుండి తొలగించుటచేత సమాధి లభించును; పిమ్మట ఆత్మ సాక్షాత్కారము కలుగును.

"విజ్ఞానము" అనగా హెచ్చువివేకముతోడను పూర్ణతతోడను ఎఱుగుట అని అర్థము. కొందఱు పాలనుగూర్చి వినియుందురు; కొందఱు పాలను చూచియుందురు. మఱికొందఱు పాలను రుచిచూచియుందురు. దానిని చూచినవాడు జ్ఞాని. దానిని రుచిచూచినయతడు విజ్ఞాని అనబడును; అతడే దానిని పూర్ణముగ నెఱింగినవాడు. భగవంతునిచూచి, కేవలము మన బంధువువలె వానితోడ సంసర్గము కలిగి యుండుటకు విజ్ఞానమనిపేరు.

909. మొదట "నేతి, నేతి" (ఇదికాదు, ఇదికాదు) అను మార్గమున అవలంబించవలయును. ఈపంచభూతాత్మక శరీరము బ్రహ్మముకాదు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధియు బ్రహ్మముకాదు; అహంకారమును బ్రహ్మముకాదు. బ్రహ్మము సకలతత్వములకును అతీతము. నీవు మేడచేరుటకు ఒకటొకటిగా మెట్లనన్నిటిని విడిచివేయవలయును. మెట్లెన్నటికిని మేడకాజాలవు. కాని నీవు మేడచేరినపిమ్మట, ఏయిటుకలు, సున్నము సిమెంటు ఇసుక మున్నగు పదార్థములతో మేడ ఏర్పడినదో, ఆపదార్థములతోడనే మెట్లును నిర్మాణమైయున్నవని గ్రహింతువు. బ్రహ్మముగా తెలియబడునదే జీవజగత్తులు నైనది - ఈ యిరువదినాలుగు తత్వముల రూపమును తాల్చి