పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

311

40వ అధ్యాయము.

లోని చెట్లన్నియు ఎత్తులోను, యోగ్యతలోను, సౌందర్యములోను సమానములు కావు.

"బ్రహ్మసాక్షాత్కారము కానంతవఱకును నరుడు తాను స్వతంత్రుడ ననుకొనుచుండును. కాని భగవంతుడే యీభ్రాంతినివానియందు నిలుపువాడు. లేనియెడలపాపకార్యములసంఖ్య చాలగా హెచ్చిపోవును. ప్రజలు పాపపు పనుల చేయుటకు జంకక, దోషకార్యములకు శిక్ష అనుభవించ వలయునను బాధ్యతలేక విచ్చలవిడి వర్తింతురు."

"సరే! బ్రహ్మసాక్షాత్కారము పడసినవాని భావన యెట్లుండునో తెలియునా? - "నేనుయంత్రమను, నీవుయంత్రచోదకుడవు; నేనుగృహమను, నీవు గృహాధిపతివి; నేను రధమను. నీవు రధికుడవు. నీవు కదలించుతీరున నేను కదులుదును. నీవు పలికించినరీతిని నేను పలుకుదును." ఇట్లుండును!

897. శ్రీచైతన్యస్వామికి మూడురకముల దశలుండెడివి. (1) మనస్సు స్థూలసూక్ష్మశరీరములందు వసించునప్పుడు జాగ్రదవస్థ. (2) మనస్సు కారణశరీరమున ప్రవేశించి "కారణానందమును" అనుభవించునప్పుడు అర్థజాగరము. (3) మహాకారణమున పూర్తిగమనస్సు లయమగునప్పుడు అంతర్ముఖమై యుండు తురీయము.

ఈవర్ణనకును వేదాంతుల పంచకోశములకును పోలికయున్నది. (1) స్థూలశరీరము - అన్నమయకోశము. ప్రాణమయకోశమును. (2) సూక్ష్మశరీరము - మనోమయ విజ్ఞానమయకోశములు. (3) కారణశరీరము - ఆనందమయకోశము.