పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

312

మహాకారణము ఈపంచకోశములకు అతీతముగ నుండును. మనస్సు మహాకారణమున ప్రవేశించునప్పుడు చైతన్యస్వామికి సమాధిదశ ప్రాప్తించెడిది. దీనిని నిర్వికల్పసమాధి లేక జడ సమాధి అందురు."

898. ప్రారబ్థ సంస్కారములుండుటవలన నరుడు సంసారత్యాగముచేయవలయునన్నను చేయలేడు. ఒకసారి యోగి యొకడు రాజును తన దాపున కూర్చిండి భగవధ్యానము చేయుమనెను. అందుకారాజు "అయ్యా! అదిపొసగదు. నేను నీసామీప్యమున నుండవచ్చును; అయినను నాకు భోగమున్నది గదా! నేను ఈఅడవిలోనే ఉండిపోయినయెడల బహుశః ఇచ్చటనే ఒకరాజ్యమేర్పడ గలదు. నేను నాభోగమును అనుభవించక తీరదుగదా!" అనెను.

899. "అనాహత" ధ్వని దానంతట నదియే శబ్దించుచుండును. ఇది "ఓం" అను ప్రణవనాదము. ఇది పరమాత్మ నుండి కలుగును; యోగులు దీని వినగలరు. సామాన్య లౌకికులు దీనిని వినజాలరు. ఈనాదము ఒకపక్షమున నాభిస్థానము నుండియు, రెండవ పక్షమున పరబ్రహ్మమునుండియు పుట్టునటుల యోగులకు తెలియవచ్చును.

900. పురాణముల ప్రకారము భక్తుడును భగవంతుడును వేఱు. నేనొక వ్యక్తిని భగవంతుడు వేఱొకవ్యక్తి. ఈశరీరము ఒక ఘటమువంటిది; మనస్సు బుద్ధి అహంకారము ఆకుండలోని నీటిని బోలునవి. బ్రహ్మము సూర్యుడు. ఆసూర్యుడు