పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

310

ఏమైనకానీ. భగవంతుని చేరకుండ అడ్డుపడుభార్య అవిధ్యారూపిణి! కాని రాజు దుష్టుడు, భార్యమొదలగువారందఱును భగవంతునియెడ నిర్మలభక్తికలవానికి వశులగుదురు. ఒకనికి సత్యమగు భక్తియున్నయెడల భార్యయు క్రమక్రమముగాదైవమార్గమున తిరుగగలదు. అతడు యోగ్యుడగునేని, భగవత్కృపవలన, భార్యయు యోగ్యురాలగును.

895. బ్రహ్మసాక్షాత్కారము పొందినపిమ్మట భగవంతుడు సర్వత్ర సర్వమునందును ప్రత్యక్షముగ నుండును. కాని భగవత్ప్రసన్నత నరునందు శ్రేష్ఠముగ నుండును; మఱియు సత్వగుణప్రధానులగు భక్తులందు అత్యంత శ్రేష్ఠముగ నుండును. కామినీకాంచనములయెడ వ్యసనము ఉత్తమ భక్తులకుండదు.

896. భక్తునిప్రశ్న:- "స్వామీ! నాకొక సందేహ మున్నది. మనకు స్వేచ్ఛకలదందురు; అనగా ధర్మముగాని అధర్మముగాని మన యిష్టమువచ్చినటుల చేయగలమందురు. అది సత్యమా? మనయిచ్ఛకు స్వాతంత్ర్యము కలదా?"

శ్రీపరమహంసులవారు:- "సర్వమును భగవంతుని సంకల్పము ననుసరించి నడుచును! ఇదంతయు వానిలీల! ఆతడు మనచేత అనేకవిధముల అనేకకార్యములను - మంచివి చెడ్డవి, కొద్దివి గొప్పవి, క్షుద్రమైనవిఘనమైనవి - చేయించుచుండును. యోగ్యులు అయోగ్యులు ఎల్లరు వాని మాయయే - వాని లీల. ఉదాహరణకు చూడుడు. తోట