పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

302

విధభక్తికలదు. భగవంతునియెడగాఢప్రేమయున్నవారికి కలుగును. ప్రహ్లాదుని భక్తి అటువంటిది. "రాగభక్తి" అలవడిన పిమ్మట "వైధీకర్మ" అనగా శాస్త్రనియమిత కర్మలుచేయు నవసరములేదు.

868. నరునికి సత్యజ్ఞానప్రాప్తియైన పిమ్మట వానికి భగవంతుడు ఏదోదూరపువస్తువుగ గోచరించడు. అప్పుడు "ఆయన" గా కాక "ఈయన" గా ఇచ్చట మనహృదయములోపల ఉన్నవాడుగ భగవంతుడు దాపైతోచును. ఆయన అందఱిలోనున్నాడు. ఆయనను వెదకువారికెల్ల అక్కడ దర్శనమిచ్చును.

869. ప్ర:- గృహస్థజీవనముగడుపుచుండగను జ్ఞానప్రాప్తియైనయెడల, ఎటులగ్రహించవచ్చును?

ఉ:- హరినామము చెవినిబడగనే వెల్లివిరియు బాష్పములు గగుర్పాటును చిహ్నములు, స్వామిపేరు వినినంతనే కండ్లనుండి నీరుప్రవహించెనా, రోమము నిక్కబొడుచుకొనెనా, అట్టివాడు నిజముగా జ్ఞానియైనట్లే!

870. భగవంతునియెడ విశ్వాసములేని కారణముననే నరుడు దుఃఖముల ననుభవించును.

871. వేదాంతమునకు శంకరాచార్యులవారు చేసిన అర్థము సత్యమైనదే. దానింగూర్చి రామానుజా చార్యులవారు చెప్పునదియు - వారివిశిష్టాద్వైతమును - సత్యమే!

872. నరునందలి అంతరాత్మప్రబోధము గాంచినగాని వానికి బ్రహ్మసాక్షాత్కారముకాదు.