పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

301

40వ అధ్యాయము.

మఱియు మానవులు వేర్వేఱు స్వభావములుగలవారై యుండుటనెఱిగి, వారితో నీకు సాధ్యమగునంతవఱకే కలియవలయును. నీవు మాత్రము అందఱిని ప్రేమించవలసినదే.

అంతట నీవింటికి (నీఅంతరాత్మలోనికి) మరలిపోయి శాంత్యానందముల ననుభవించుము. అక్కడ నీవు నీసత్యాత్మను కనుగొనగలవు.

866. అపరోక్షానుభూతిని పడయుటకు గట్టిప్రయత్నము అవసరము. ఒకనాడు నేను భావసమాధిలో నుండగా నాకు హలధరసరస్సు కాన్పించినది. (ఇదిశ్రీరామకృష్ణపరమహంసులవారి జన్మగ్రామమగు కర్మకారపురమున వారిపూర్వీకులు వసించినయింటిఎదుట నున్నది.) ఒక మోటుమానిసి నాచుమొక్కలను తీసివేసి నీటిని ముంచుకొనుచున్నటులను అప్పుడప్పుడు దానిని చేతిలోనికిదీసికొని పరీక్షించుచున్నటులను కన్పించినది. నాచును తొలగించినిది నీరుకనబడదు - కష్టపడి సాధనచేయనిది భక్తి అలవడదు, బ్రహ్మసాక్షాత్కారము లభించదు - అనినాకునేర్పుటకో యనునటుల నాకాదృశ్యము చూపబడినది. ధ్యానముసలుపుట, భగవన్నామస్మరణ చేయుచు తులసీమాల త్రిప్పుట, హరిమహిమలపాడుట, ప్రార్ధనలుచేయుట, దానములొసగుట, యజ్ఞములుచేయుట మొదలగు సత్కార్యములు భగవంతుని ప్రసన్నునిచేయును.

867. "ఈయీకర్మలుచేయవలయునని శాస్త్రములువిధించుచున్నవి. కావున నేను చేయుచున్నాను" - అనునట్టిభావము "వైదీభక్తి" అనిపించుకొనును. "రాగభక్తి" అను నింకొక