పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

303

40వ అధ్యాయము.

873. తర్కము ద్వారమునగలుగు జ్ఞానము ఒకరకము; ధ్యానమువలనగలుగు జ్ఞానము వేఱొకరకము; మఱియు భగవత్ప్రసన్నముచేగలుగు జ్ఞానము మఱొకరకము అని నేను గ్రహించినాను.

874. మనుజునందు శుద్ధసత్వము ప్రధానముగ నున్నప్పుడు అతడు కేవలము భగవధ్యానమున కాలము గడుపును; ఏయితర వ్యాపారమునందును వానికి హితవుండదు. ప్రారబ్ధవశమున కొందఱు ఇట్టి శుద్ధసత్వగుణముగలవారై పుట్టుదురు. కాని నిష్కామకర్మలను పూనికతోచేయుచుండిన యెడలను శుద్ధసత్వగుణము అలవడగలదు. రజోగుణముతో మిశ్రమైన సత్వగుణముగలవాని మనస్సు నెమ్మదిగా వేర్వేఱుదిశలకు లాగబడును; "నేను ప్రపంచమునకు మేలుకూర్తును" అను అహంభావమును తెచ్చిపెట్టును. సామాన్యజీవులు లోకోపకారమునకు పూనుట చాల అపాయకరము. కాని కేవలము ఇతరుల క్షేమమునిమిత్తము, అపేక్ష యేమియులేకుండ పనిచేయునెడల అపాయముండదు. "నిష్కామకర్మ" అనగా నిటువంటిదే. అటువంటికార్యములను చేయుట వాంఛనీయమే. కాని అందఱునుచేయలేరు! చాలకష్టము!

875. అందఱును కర్మచేయవలసియే యుండును - కొలదిమంది మాత్రమే కర్మత్యాగము చేయనగును. అందుకు తగిన శుద్ధసత్వగుణము కొలదిమందియందే యుండును. స్వలాభాపేక్షలేకుండ కర్మ చేయగా చేయగా, రజస్సుతో