పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

293

40వ అధ్యాయము.

అశ్రద్ధగా పలికినట్లుండును. ఎఱ్ఱగ కాలియున్న ఇనుపకమ్మి మీద గోరునీరు చిలుకరించినటుల క్షణకాలపు పలుకువిని! భగవంతుని గూర్చి తీవ్రపిపాస యుండవలెను సుడీ! ఆమహాసముద్రములో దుమికి మునిగిపోవలసినదే.

845. ఆత్మయొక్క విభూతిని ప్రకటించు గర్వము గర్వముకాదు; ఆత్మకు అవమానముంగూర్చు వినయము వినయముకాదు.

846. యోచనచేత నరుడు క్రుంగిపోవును. బలిచక్రవర్తిని యాచించబోయినప్పుడు విష్ణుదేవునంతటి వాడు వామనుడు కావలసివచ్చెను. నీవు ఎవరినుండియేని దేనినైనను యాచింపబూనితివా తక్షణము నీకు హీనతవాటిలునని భగవంతుడట్లు నిదర్శనమును చూపినాడు.

847. శివాంశతో పుట్టినవాడు జ్ఞానియగును. ఆతడు నిరంతరము "బ్రహ్మసత్యము, జగన్మిథ్య" అనుభావముతో నుండును విష్ణ్వాంశతో పుట్టినవానికి భక్తిశ్రద్ధలందేనాడును లోపముండదు. ఎన్నడైన తర్కముగాని, పండితప్రకర్షగాని వానిని ఆవహించి, క్షణకాలము భక్తిశ్రద్ధలు వన్నెతగ్గినను, యాదవకులమును నాశముచేసిన ముసలమువలె తీవ్రరూపమున పునరుద్ధరణమునందును.

848. ఆత్మ నిర్లేపుడని (దేవిని అంటనివాడని) వేదాంతులు చెప్పుదురు. పాపముగాని పుణ్యముగాని, దుఃఖముగాని సుఖముగాని దానిని అంటవు. అయినను దేహభ్రాంతి గల