పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

292

840. మేడకట్టుచుండుకాలమున, పరంజాచాలఅవసరమే. కాని కట్టుడపుపని ముగిసిన యనంతరము పరంజా ఎవరికినిఅవసరముండదు. అటులనే విగ్రహారాధనము ప్రారంభమున అవసరమే గాని పిమ్మట నవసరముండదు.

841. కోపము తమో గుణలక్షణము. కోపమువచ్చినప్పుడు మానవుడు వివేకమును పూర్తిగ పోగొట్టుకొనును. హనుమంతుడు లంకకు నిప్పంటించి దహించెను కాని ఆసమయమున సీతాదేవియున్న గదికూడ తగులపడునేమొయని ఊహించుపాటి వివేకమువానికి లేకపోయెను.

842. భగవంతుని శరణుజొచ్చినవానినడకలో తడబాటుండును.

843. సూక్ష్మధర్మముల భావమును నిజముగా గ్రహింపజాలువారు అరుదుగానుందురు. లోకులచేత దుర్మార్గులుగా చూడబడువారియందు సయితము యోగ్యులుండుట సంభవించును.

844. లౌకికులు భగవంతుని ఎట్లు తలపోయుదురో తెలియునా? తమలోతాము ఆటలాడుకొను సమయమున చిన్నపిల్లలు ప్రలాపించి నట్లుండును. ఒక్కొకప్పుడు వారు "దేవునితోడు నామాటనిజము" అందురు. పెద్దవాండ్రు ఒట్లు పెట్టుకొనుచుండగావిని వీరును నేర్చియుందురు. లేదా బడాయి కోరొకడు పూలతోటలో విలాసముగ తిరుగాడుచు పూవు నొకదానిని పెఱికి "ఆహా! భగవంతుడీ పుష్పమును ఎంతమనోహరముగ చేసినాడు!" అని బుద్ధి నెక్కడనో పెట్టుకొని