పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

294

వారిని ఇవి బాధించును. గోడకు మసి అంటుకొనునుగాని ఆకాశమునకు అంటుకొనజాలదు సుమీ!

849. బాలుని బోలు విశ్వాసమును పూనినగాని నరుడు బ్రహ్మావలోకనము చేయజాలడు. ఎవనినైనను చూపి, వాడు నీ అన్న అని తల్లి చెప్పినయెడల చిన్నబిడ్డడు వానిని తన సోదరుడుగ భావించును. "అటుపోకు, అక్కడ బూచియున్నది" అని తల్లి చెప్పుచో అక్కడ బూచియేదో యున్నదనియే పసివాడు విశ్వసించును. అట్టి పసివారికున్నట్టి విశ్వాసముగల మనుజులపైని భగవంతునికి కరుణ కలుగును. లోకవ్యవహర్తలవలె గణితములువేయు బుద్ధులుగలవారికి భగవంతుడు సులభుడుకాడు.

850. అద్వైతజ్ఞానము పరమోత్తమమైనది. అయినను మొదటపూజకుడు పూజ్యుడు అనుభావముపూని క్రమసాధనను చేయవలెను. (అనగా భగవంతుడు నాపూజల నందుకొనువాడు, నేను పూజలర్పించువాడను అను భావము ప్రారంభమున పూనవలయును). తుదను సులభముగా అద్వైజ్ఞానమును పడయవచ్చును.

851. అర్జునుడు సత్యమగు వీరుడు; దేనిని తన ధర్మమని నమ్మెనో, దేవిని ఆచరించుట యోగ్యమని విశ్వసించునో, దానిని చేసితీరెను.

852. జీవన్ముక్తులనంటుకొని కొంచెము మాయయుండును. పూర్ణ బ్రహ్మజ్ఞానము కలిగినపిమ్మట ఇరువదియొక్కదినములలో శరీరము పడిపోవును.